
పుట్ట మధుకార్ అనుచిత వ్యాఖ్యలు హాస్యాస్పదం
-మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల.తిరుపతి యాదవ్.
రామగిరి,జూలై 12 (మన ప్రజావాణి)
మంత్రి శ్రీధర్ బాబు పై బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధుకార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా స్పందించింది. శనివారం రామగిరి మండలంలోని శ్రీపాద ఐఎన్టీయూసి భవన్లో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పత్రికల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రొడ్డ బాపున్నా ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.....
పుట్ట మధుకార్ అనే వ్యక్తి ప్రజల కోసం కాదు,తన రాజకీయ ఉనికికోసమే వ్యవహరిస్తున్నాడు.మంత్రి శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధిని ప్రశంసించడమే కాకుండా, ప్రజలకు ఉపయోగపడే మార్గంలో వ్యవహరించాల్సిన బాధ్యత అతనిపై ఉంది.కానీ ఆయనకు అభివృద్ధిపై లేశమాత్రమైన ఆసక్తి లేదు” అని మండిపడ్డారు. ఇటీవల రామగిరి మండలంలోని నాగపెల్లి గ్రామంలో చోటు చేసుకున్న ప్రేమవివాహ జంట ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని రాజకీయంగా వాడుకుంటూ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులపై నిందలు వేయడాన్ని ఆయన ఖండించారు.ఒకప్పుడు ఎంపీటీసీ గా,జెడ్పీ చైర్మన్గా ఉన్నావు కాబట్టి రాజ్యాంగ విలువల పట్ల నీకు బాధ్యత ఉండాలి. పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం ఏ విధంగానూ సమర్థించదగినది కాదు. ప్రజల శాంతిని భద్రపరచాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన తెలిపారు. గత పాలనలో బీఆర్ఎస్ నాయకుల తీరుతో గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొన్నదని, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు.శ్రీధర్ బాబు నాయకత్వం లేకుండా మీ రాజకీయ జీవితం నిలదొక్కుకోలేకపోతుంది. ఆయన పేరును జపించకపోతే మీ పబ్బం గడవదన్న విషయం మీకే తెలుసుకోవాలని తిరుపతి యాదవ్ ఎద్దేవా చేశారు.మరోసారి మంత్రి శ్రీధర్ బాబు పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు లపై అసత్యపు ఆరోపణలు చేస్తే దానికి సమాధానం రెట్టింపులో ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025