
*నల్గొండ నర్సింగ్ స్టూడెంట్ (శ్రీలత) అనుమానస్పదం గా మృతి*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 30 (మన ప్రజావాణి)*:
నల్లగొండ పట్టణం లోని బోయవాడ లో మృతురాలు శ్రీలత అద్దె రూములో గత కొన్ని రోజుల నుంచి ఉంటున్నట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకి శవమై అనుమానస్పదం గా తన రూములో తమ కుటుంబ సభ్యులకు కనిపించిన దృశ్యం. ఎవరైనా హత్య చేశారా..?ఆత్మహత్యనా..? పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపించి విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు. శ్రీలత చావుకి కారణమైన వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.