
*అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా జలబిందల కార్యక్రమం వెల్లువెత్తిన ప్రజాసేత్రం*
*పాయిలి కోటేశ్వరరావు స్వామి 18 పడి సందర్భంగా*
*చిలుకూరు నవంబర్9(మన ప్రజావాణి)*:చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షలో భాగంగా పాయిలి కోటేశ్వరరావు స్వామి అయ్యప్ప స్వామి 18 పడి సందర్భంగా ఈనెల 10వ తారీకు సోమవారం రోజున గ్రామంలో అయ్యప్ప భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దాతల సహకారంతో పడిపూజ అగ్నిగుండం నిర్వహించటానికి ముహూర్తం ఖరారు చేశారు.అందులో భాగంగా ఈ రోజున అయ్యప్ప స్వామికి జల పన్నిరాభిషేకంలో భాగంగా గ్రామంలో డిజె సౌండ్ తో,కోలాట బృందంతో కన్నుల పండుగ మహిళలు పెద్ద ఎత్తున జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. జలబిందెల కార్యక్రమంలో వెల్లువెత్తిన ప్రజాశక్తి గ్రామంలో స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే అంటూ నామకరణతో నామాలతో దద్దరిల్లిన భక్త మహాశయులు గ్రామంలో పడి పూజ అగ్రిగుండం కార్యక్రమం సందర్భంగా మద్యం దుకాణాలు చికెన్ సెంటర్లో బంద్ చేసి గ్రామ ప్రజలు కులాల మతాలకు అతీతంగా ఇళ్ళను శుభ్రపరచుకొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సాయ సహకారంతో ఘనంగా నిర్వహించినారు..








