
*ఉమ్మడి వెల్గటూర్ ఎస్సైగా బాధ్యతల చేపట్టిన ఉదయ్ కుమార్*
జగిత్యాల, వెల్గటూర్ నవంబర్ 17 (మన ప్రజావాణి):
ఉమ్మడి వెల్గటూర్ మండల ఎస్సైగా పి ఉదయ్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకు ముందు ధర్మపురిలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇంతకుముందు వెల్గటూర్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆర్ ఉమాసాగర్ జగిత్యాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన వెల్గటూర్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్ కుమార్ కు స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ఇరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ముందుకు సాగుతామని, ప్రజల శాంతిభద్రతలకై ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.








