
*ఎండపల్లి సర్పంచ్ అభ్యర్థిగా రజియా బషీర్ నామినేషన్*
*గ్రామా అభివృద్ధి, ప్రజల ఆశల సాకారమే మా లక్ష్యం*
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి డిసెంబర్ 05(మన ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి శుక్రవారం రోజున మహమ్మద్ రజియా బషీర్ పలువురు అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రజియా బషీర్ మాట్లాడుతూ…. గ్రామ అభివృద్ధే తనను ఎన్నికల రంగం లోకి రావడానికి ప్రధాన కారణమని గ్రామ అభివృద్ధికి తీసుకోవలసిన కీలక చర్యలను ఆమె వివరించారు. ఎన్నుకైన తర్వాత ప్రధానంగా చేయనున్న పనులను వివరించారు, గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం, రహదారుల విస్తరణ, సిసి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరచడం
మురికి కాలువల శుభ్రత, చెత్త నిర్వహణలో పారదర్శక విధానం, పేద ప్రజలు, వృద్ధులకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా గ్రామస్థాయిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
మహిళలు, యువత కోసం స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి, సాంస్కృతిక వేదికల ఏర్పాటు, గ్రామంలో పచ్చదనం పెంపు, వైకుంఠం దామం పునర్వనీకరణ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల అమలులో ప్రతి ఇంటి నుంచి అభిప్రాయాలు స్వీకరించి, ప్రజలే నిర్ణయాలు తీసుకునే పద్ధతిని అమలు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎండపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం నా లక్ష్యం అని రజియా బషీర్ స్పష్టం చేశారు. ప్రతి ఓటరు తనకి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.








