
ఎమ్మెల్యే పై అసత్య ప్రచారం, బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ అనంత బాబు పై
చర్యలు తీసుకోవాలని స్టేషన్ లో పిర్యాదు.
ప్రజావాణి ప్రతినిధి ఎటుపాక మండలం డిసెంబర్ 28
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎటపాక: మండలం ఎమ్మెల్సీ అనంత బాబు పై చర్యలు తీసుకోవాలనీ ఎటపాక మండలం టీడీపి నాయకులూ ఎటపాక పోలీస్ స్టేషన్ లో ఆదివారం పిర్యాదు చేశారు. రంప చోడవరం ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ అనంత బాబు పై చర్యలు తీసుకోవాలన్నానీ, టిడిపి నేతలు స్టేషన్లో పిర్యాదు చేశారు.ప్రస్తుత ఎమ్మెల్సీ రంపచోడవరం నియోజకవర్గం ఎస్టీ ఎమ్మెల్యే అయినటు వంటి మిరియాల శిరీషదేవి పై తరచూ ఆరోపణలు , అసత్య ప్రచారాలు చేస్తున్నాడనీ, ఆయన తీరు వలన ప్రభుత్వప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తున్నాడనీ, ఎమ్మెల్యే పై మానసిక దాడులు చేస్తున్నారని, కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో ఆమె పరువు, ప్రతిష్ట లకు తీవ్ర విఘాతం కలిగేలా చేస్తున్నారూ. ఆయన చర్య వలన ప్రభుత్వంపై కూడా మచ్చ పడేలేఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహారిస్తున్నాడనీ, సామాజిక మధ్యమాల్లో ప్రజలకు కూటమి ప్రభుత్వం పై తప్పుడు అభిప్రాయం కలిగేలా వదంతులు సృష్టిస్తున్నారనీ అన్నారు. ఆయన మాటలు ద్వారా నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా భావోద్వేగాలను రెచ్చగొడుతూ అలజడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అంతేగాకుండా ఆయన కనుసైగ చేస్తే అమెరికాలో ఉండి కూడా మీ అంతు చూడగలను మిమ్మల్ని చంపుతానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆయన వ్యాక్యాలు ఎమ్మెల్యే, ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని, ఆయన పై చర్యలు తీసుకోవలనీ కోరారు. ఈ కార్యక్రమంలో కొమరం నాగేష్, పర్షిక రాజు, మండల అధ్యక్షులు బొల్లా పుల్లయ్య, వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వర రావు, సొసైటీ చైర్మన్ మాచినేని రాజేష్, నాలజాల మధు, చండ్ర రఘు,








