
ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం..
••రోగుల అన్నంలో పురుగులు కలకలం.
•••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..?
••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు.
•••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్.
రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వెలుగుచూసింది.రోగులకు ప్రాణం పోయాల్సిన చోట, వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వైనం బయటపడింది.ఆసుపత్రిలో రోగులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పురుగులు దర్శనమివ్వడం కలకలం రేపింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రోగులకు వడ్డించిన అన్నంలో తెల్లటి పురుగులు కనిపించడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తిన్న అన్నం కాస్తా కడుపులో వికటించి మరిన్ని రోగాల బారిన పడతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…అన్నంలో పురుగులు ఉన్న దృశ్యాలను కొందరు రోగుల బంధువులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ప్రభుత్వం రోగుల భోజనం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు..
ఆసుపత్రి సిబ్బంది భోజన నిర్వాహకుల తీరుపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రోగం తక్కువై ఇంటికి వెళ్దామనుకుంటే, ఇలాంటి తిండి పెట్టి ఉన్న రోగాన్ని పెంచుతున్నారా?” అంటూ నిలదీశారు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బాధ్యులైన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, భోజన నాణ్యతను పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..








