
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..?
మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..?
సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..?
లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..?
ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?
ప్రజా ప్రభుత్వంలో ఇటువంటి నిర్లక్ష్యంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటూ అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు…!
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధి లో మేడేపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలకు భర్త ద్వారా సుమారు 15 సంవత్సరాల క్రితం హెచ్ఐవిగా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన నేపథ్యంలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తోపాటు కనీసం పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. పైగా సోమవారం డ్యూటీలో ఉన్న డాక్టర్ పేరు కూడా తెలవదంటూ వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన చిత్రాలు కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తూ అక్కడికి రండి ఇక్కడికి రండి అంటూ నానా ఇబ్బందులు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇదే వ్యవహారంపై జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ ను సంప్రదించినప్పటికీ అంతగా పట్టించుకోలేదని బాధితులు అంటున్న నేపథ్యం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి అధికారులు ప్రభుత్వం స్పందించి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ప్రజలు కోరుతున్నారు







