
ఏసీబీకి చిక్కిన తూనికలు కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
తూనికలు కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి ప్రవీణ్ కుమార్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వేబ్రిడ్జి ధ్రువీకరణ పత్రం కోసం ఓ ఏజెంట్ నుంచి రూ.10 వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనతో కార్యాలయంలో నగదు అందజేస్తుండగా డీఎస్పీ రమేశ్ బృందం దాడి చేసి పట్టుకుంది.







