FLASH NEWS

మంత్రి పొన్నం వస్తే.. చర్చకు సిద్ధమే: బీఆర్‌ఎస్‌ నేత మాట్ల మధు మాజీ సర్పంచ్

మంత్రి పొన్నం వస్తే.. చర్చకు సిద్ధమే: బీఆర్‌ఎస్‌ నేత మాట్ల మధు మాజీ సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు.సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తంగళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15 సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమేనని, మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా రావాలని సవాల్‌ విసిరారు. 12 ఏండ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు పొన్నం ప్రభాకర్ డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, వాటిని ఇప్పటికే ఖండించానని, ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వచ్చి తనకు డబ్బులు ఇచ్చినట్లు చెబితే, దేనికైనా సిద్ధమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే తమ గౌరవం ఉందని, తనకు వీలుకాకుంటే, పొన్నం ప్రభాకర్ వద్దకే వస్తామని చెప్పారు. హుస్నాబాద్ అయినా సరే, హైదరాబాద్‌ అయినా సరే సమయం చెబితే వస్తానని పేర్కొన్నారు. తమ నాయకుడు కేటీఆర్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తనే, దీటుగా స్పందించామని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలన్నింటికీ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కారణమని, ఆయనే బాధ్యతవహించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేత కేకే, కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కుర్మా రాజయ్య, కొయ్యడ రమేష్, ఆత్మకూరి చంటి, గుండు ప్రేమ్ కుమార్, సిలువేరి చిరంజీవి, గొడిసెల ఎల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, అమర్ రావు, మల్లారాపు నరేష్, తదితరులు ఉన్నారు.

*2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్*

*2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్* వచ్చే మూడేళ్లలో (2028 కల్లా) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఐదవ స్థానంలో ఉన్న భారత్.. 2026లో అమెరికా, చైనా, జర్మనీ తరువాత స్థానానికి, ఆ తదుపరి రెండేళ్లలో జర్మనీని అధిగమించి మూడో స్థానానికి ఎదుగుతుందని వివరించింది…..

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్కో సిఎండి, రాజన్న సిరిసిల్ల పూర్వ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఎంపిక*

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్కో సిఎండి, రాజన్న సిరిసిల్ల పూర్వ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఎంపిక* *కృష్ణ భాస్కర్ కు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందనలు* *భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్* వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక అయ్యారు. స్టాటిస్టిక్స్ మరియు అనాలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది. Massachusetts Institute of Technology (MIT) కోర్సు లో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ లో చదువుకొని అందులో చేసిన ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఆధారంగా ఈ ఫెలోషిప్ కు ఎంపిక చేశారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫెలోషిప్ కోసం 2600 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 33 మంది ప్రభుత్వంలో పని చేసిన అధికారులను ఎంపికగా చేశారు. కాగా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్ కావడం గమనార్హం. ఫెలోషిప్ లో భాగంగా వాషింగ్టన్ డిసీలో తొమ్మిది రోజుల పాటు నేరుగా ట్రైనింగ్ పొందేందుకు రావాలంటూ వరల్డ్ బ్యాంక్ అధికారులు కృష్ణ భాస్కర్ కు ఆహ్వానం పంపారు. ఆరు నెలల కోర్సులో భాగంగా ప్రత్యేక శిక్షణ తదుపరి డిజిటల్ అనుబంధంగా ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ కు ఎంపికైన కృష్ణ భాస్కర్ అమెరికా వెళ్లడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్సు కు సంబంధించిన వ్యయం మొత్తం వ్యయం మొత్తం వరల్డ్ బ్యాంక్ భరిస్తుంది. స్టాటిస్టిక్స్ మరియు అనాలటిక్స్ సంబంధించి అనుబంధాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించాలనేది వరల్డ్ బ్యాంక్ ఆలోచన. ఈనెల 18 నుంచి 27 వరకు అమెరికాలో ప్రత్యక్ష కోర్సు జరుగనుంది. *కృష్ణ భాస్కర్ కు ఉపముఖ్యమంత్రి అభినందనలు* ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ఎంపికైన తన స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ను గురువారం అసెంబ్లీ ఆవరణలో అభినందించారు. భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకరు ఎంపిక కావడం అది మన రాష్ట్రానికి చెందిన ట్రాన్స్కో సీఎండి కావడం పై హర్షం వ్యక్తం చేశారు.

నూజివీడు సీడ్స్ వారి క్షేత్ర ప్రదర్శన

*నూజివీడు సీడ్స్ వారి క్షేత్ర ప్రదర్శన* ఓదెల, మార్చి13 (మన ప్రజావాణి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామంలో బుధవారం రోజున నూజివీడు సీడ్స్ కంపెనీ మొక్కజొన్న కొత్తవంగడం విన్నర్ గోల్డ్ (8413) రకంను గ్రామానికి చెందిన వంగల మహేందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో రైతులతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ నీలా రాజు మాట్లాడుతూ….. ఈ యొక్క నూతన విన్నర్ గోల్డ్ మొక్కజొన్న వంగడం మిగతా రకాల హైబ్రిడ్ వంగడాల కంటే 4 నుండి 5 క్వింటాల వరకు అధిక దిగుబడి వస్తుందన్నారు, అంతేకాకుండా అన్ని రకాల తెగుళ్లను తట్టుకుంటుందని, కత్తెర పురుగును పూర్తి స్థాయిలో తట్టుకుంటుందన్నారు. నూజివీడు సీడ్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొత్త వంగడం అయిన విన్నర్ గోల్డ్ ప్రతి ఒక్క రైతు ఆదరించి మంచి దిగుబడి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి, మారుతి, గంగరాజు, చంద్రమౌళి, అధిక సంఖ్యలో చుట్టూప్రక్క గ్రామాల రైతులు పాల్గొన్నారు.

_వాహన తనిఖీల్లో పట్టుబడిన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న నరసన్నపేట పోలీసులు

*✍️శ్రీకాకుళం జిల్లా పోలీసు.* *_భారీగా గంజాయి స్వాధీనం._* _వాహన తనిఖీల్లో పట్టుబడిన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న నరసన్నపేట పోలీసులు._ _ముందస్తు సమాచారంతో మడపాం టోలేట్ ప్లాజా వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు చేపడుతున్న సమయంలో ఒడిస్సా రాష్ట్రం, గంజాం జిల్లా సుబలై గ్రామానికి చెందిన తుఫాన్ కరియా అనే వ్యక్తి వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నట్లు సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు.తుఫాన్ కరియా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి గుజరాత్ రాష్ట్రం లోని సూరత్ నందు రితీష్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడిను. ఈ సమయంలో తుఫాన్ కరియా ఒక వాహనంలో నుంచి దిగిపారిపోతుండగా వెంబడించి పట్టుకొని కేసు నమోదు చేసి 24 కేజీల గంజాయని స్వాధీనం చేసుకున్నట్లు నర్సన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు కేసు వివరాలను బుధవారం తెలిపారు._

*🟥SLBC టన్నెల్‌లో 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్*

*🟥SLBC టన్నెల్‌లో 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్* Mar 13, 2025, _SLBC టన్నెల్‌లో 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్_ _తెలంగాణ : SLBC టన్నెల్‌లో గల్లంతైన వారి ఆచూకీ కోసం 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్‌, కాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికీ మృతదేహాల ఆనవాళ్లు దొరకలేదని అధికారులు ప్రకటించారు. డీ1 ప్రాంతంలో శిథిలాల కింద ఉండొచ్చని రెస్క్యూ టీమ్స్‌ భావిస్తున్నాయి. మరో ఏడు మృతదేహాల కోసం సెర్చ్ చేస్తున్నారు. దీంతో, రోబో యంత్రాలతో డేంజర్‌ జోన్‌ తవ్వెందుకు వారు ప్లాన్ చేస్తున్నారు._

గుండెపోటుకు చైనా వ్యాక్సిన్

*గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!* గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ను నివారించడానికి చైనా వ్యాక్సిన్ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ‘కాక్టైల్’ రూపంలో ఈ నానో వ్యాక్సిన్ను రూపొందించాయి.

రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు’

‘రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు’ Mar 12, 2025, ‘రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు’ తెలంగాణ : హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు విధించారు. 14న ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు పెట్టారు. రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని తెలిపారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.

జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు ఇదే!

జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు ఇదే! మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద సభ భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘జయకేతనం’ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు తరలిరానున్నారని… ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరిగే ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందని మనోహర్ తెలిపారు. ఈ ప్రాంతానికి విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా మూడు ముఖద్వారాలకు వారి పేర్లు పెట్టామని ఆయన వెల్లడించారు. తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టామని తెలిపారు. ఆయన విద్యాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎనలేని కృషి చేశారని వివరించారు. రెండవ ద్వారానికి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేసిన దొక్కా సీతమ్మ పేరు పెట్టామని వెల్లడించారు. ఇక మూడవ ద్వారానికి విద్యాసంస్థలు స్థాపించి చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురు మహానుభావులు ఆయా ప్రాంతాలకు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు జనసేనకు అఖండ విజయాన్ని అందించారని మనోహర్ అన్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో జనసేన విజయం సాధించిందని, ఇది జనసైనికులు, వీర మహిళలు, నాయకుల నిస్వార్థ సేవలకు ఫలితమని ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 14న జరిగే ఈ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు.

కొమరంభీం: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన కలెక్టర్

కొమరంభీం: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన కలెక్టర్ Mar 12, 2025, కొమరంభీం: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన కలెక్టర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ టాలెంట్ టెస్ట్ పరీక్ష ఫలితాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మంగళవారం విడుదల చేసినట్లు ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయికుమార్, సాయికృష్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3000 మంది విద్యార్థులు పరీక్షను రాసినట్లు చెప్పారు. విద్యార్థులు తమ హెడ్‌మాస్టర్ వద్ద ఫలితాలు చూసుకోవచ్చన్నారు.

 Share

 నోటిఫికేషన్స్