‘ఆధార్’ సెంటర్లలో అడ్డగోలు దోపిడీ.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్

Ramesh

Ramesh

District Chief Reporter

ఆధార్ కేంద్రాలలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర వినియోగదారుల సంఘం కార్యదర్శి గడుగు సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల ఆధార్ కేంద్రాలలో పుట్టిన తేదీ మార్పు , అడ్రస్ మార్పు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆధార్ కేంద్రం వద్దకు ప్రజలు వెళ్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. పలుమార్లు ఆధార్ మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న పరిష్కారం జరగడం లేదు. దీంతో సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆధార్ అప్డేట్ రుసుము అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

కేవలం 50 రూపాయలు సర్వీసు ఛార్జీలు తీసుకోవాల్సి ఉండగా రూ.250 నుంచి రూ.500 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఏమని అడిగితే నీకు ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకో పో అంటూ ఆధార్ మార్పు కోసం వచ్చిన సామాన్య ప్రజల పై ఆధార్ కేంద్రం నిర్వాహకులు దుర్భాషలాడటమే కాకుండా భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సామాన్య ప్రజలు ఆధార్ కేంద్రం నిర్వాహకులు అడిగినంత డబ్బు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆధార్ కేంద్రంలో సేవా రుసుములు పట్టిక, కంప్లైంట్ సెల్ నెంబర్, ఏర్పాటు చేయాలి. జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఉండే మీసేవ కేంద్రాలు , సిఎంసి సెంటర్స్ , ఆధార్ కేంద్రాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధిక రుసుం వసూలు చేసే కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలన్నారు. లేకపోతే వినియోగదారుల తరపున ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share