334 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఎలన్ మస్క్ సంపద..!

Ramesh

Ramesh

District Chief Reporter

 ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla) అధినేత ఎలన్ మస్క్(Elon Musk) సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం మాస్క్ నికర సంపద 334.3 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్(Bloomberg Billionaire Index) నివేదించింది. యూఎస్‌ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరగడం గమనార్హం. కాగా శుక్రవారం ఒక్క రోజే టెస్లాకు చెందిన షేర్ విలువ(share value) 3.8 శాతం పెరిగింది. దీంతో 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుడిగా మస్క్ రికార్డు సృష్టించారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో మస్క్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన సంపద భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే మస్క్‌ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్‌గా ట్రంప్ నియమించిన విషయం తెలిసిందే. ఇది కూడా ఓ కారణంగా పలువురు పేర్కొంటున్నారు. ఇక అమెజాన్(Amazon) ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff Bezos) 219 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. ఒరాకిల్‌(Oracle) చైర్మన్‌ లారీ ఎల్లిసన్‌(Larry Ellison) 206 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share