ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Ramesh

Ramesh

District Chief Reporter

ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి నియమించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రం మధ్యన సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడంలో, సమన్వయాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడి ఛైర్మన్ గా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీకి కేంద్ర మంత్రి అమిత్ షా ఛైర్మన్ గా పునర్నిర్మించారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో సభ్యులుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రతిపాదించిన కేంద్రమంత్రులు, వీరితోపాటుగా శాశ్వత ఆహ్వానితులుగా మరికొంతమంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. అందులో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నియమించారు. వీరంతా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశాలకు హాజరుకావచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తో పాటుగా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూడా కొంత మంది కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి నియమించారు. ఆయా రాష్ట్రాల మధ్యన ఉన్న వివాదాలను పరిష్కరించి జాతీయ సమైఖ్యతకు కృషి చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ నిరంతరం సమన్వయం చేయడం, కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాల అమలును పర్యవేక్షించడం వంటి విధులను ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంది. అంతే కాకుండా, కౌన్సిల్ దృష్టికి వెళ్లబోయే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రక్రియను సులభతరం చేయడంలో స్టాండింగ్ కమిటీ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో, కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో శాశ్వత ఆహ్వానితుడిగా అవకాశం కల్పించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోడికి ధన్యవాదాలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్