భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలు విరమించుకున్న కెనడా

Ramesh

Ramesh

District Chief Reporter

కెనడా నుంచి భారత్‌ (Canada-India)కు వెళ్లే ప్రయాణికుల అదనపు భద్రతా తనిఖీలపై ఒట్టవా వెనక్కి తగ్గింది. భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ కు వెళ్లే ప్రయాణికులకు అదనపు భద్రతా తనిఖీలు అవసరం లేదని తేల్చి చెప్పింది. కాగా..సోమవారం కెనడా రవాణాశాఖ మంత్రి అనితా ఆనంద్‌ (Transport Minister Anita Anand) ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ముందుజాగ్రత్త చర్యలో భాగంగా భారత్‌కు ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలను (Canada enhances security screening) పెంచాం. ఈ చర్యలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఆలస్యాలు చోటుచేసుకోవచ్చు’’ అని మంత్రి వెల్లడించారు. ఈనేపథ్యంలో భారత్ వెళ్లే ప్రయాణికులు 4 గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్ కెనడా ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఇప్పుడు, ఆ ప్రకటనపై ట్రూడో సర్కారు వెనక్కి తగ్గింది.

భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్‌ ఇండియా(Air India) విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హెచ్చరించాడు. నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిర్‌ ఇండియా (Air India) విమానాల్లో ప్రయాణించొద్దని హెచ్చరిస్తూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి ప్రకటన వచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం పన్నూని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై రూ.10 లక్షల రివార్డుని ఎన్ఐఏ కూడా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది. మరోవైపు, ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ (Nijjar Murder Case) హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి టైంలోనే ఇటీవల నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ పేరును చేర్చింది. దీంతో, సంజయ్‌ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్