వచ్చే ఏడాది భారతీయుల కోసం ఇజ్రాయెల్ ఈ-వీసా సౌకర్యం

Ramesh

Ramesh

District Chief Reporter

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ఇజ్రాయెల్ ఈ ఏడాది భారతీయ పర్యాటకుల సంఖ్య 10,000కు చేరుతుందని ఆశిస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం ఈ-వీసా కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఓ అధికారి గురువారం ప్రకటనలో చెప్పారు. ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇండియా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, అమృత బంగేరా ప్రకారం.. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు దాదాపు 8,500 మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్‌ను సందర్శించారు. ‘2018లో ఇజ్రాయెల్ 70,800 మంది భారతీయ సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అప్పటివరకు అత్యధిక రికార్డు. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ పర్యాటకంపై ప్రభావం చూపడంతో సందర్శకులు తగ్గారు. 2022లో మళ్లీ భారతీయుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఏడాది 30,900 మంది పర్యాటకులు ఇజ్రాయెల్ వచ్చారని ‘ ఆమె వివరించారు. ఆ తర్వాత 2023లో 41,800 మంది పర్యాటకులు వెళ్లగా, ఈ ఏడాది యుద్ధ పరిస్థితుల వల్ల జనవరి-అక్టోబర్ మధ్య 8,500 మంది భారతీయులు పర్యటించారు. ఏడాది చివరి నాటికి భారతీయ పర్యాటకుల సంఖ్య దాదాపు 10,000కు చేరుకుంటుందని మేము ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్