స్టాక్ మార్కెట్లో వచ్చే వారం ఆరు ఐపీఓలు సందడి.. మరో నాలుగు లిస్టింగ్..!

Ramesh

Ramesh

District Chief Reporter

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఇటీవల కాలంలో ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా పబ్లిక్ ఇష్యూలోకి వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా నవంబర్ నాలుగో వారంలో కొత్తగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి రానున్నాయి. అయితే ఇందులో మెయిన్ బోర్డు(Main Board) విభాగంలో ఏవి లేవు. ఈ ఆరు సంస్థలన్నీ ఎస్ఎంఈ సెగ్మెంట్(SME Segment) నుంచి రానున్నాయి. వీటిలో రాజేష్ పవర్ సర్వీసెస్, రాజ్ పూతానా బయోడీజిల్, అభా పవర్ అండ్ స్టీల్, అపెక్స్ ఎకోటెక్, అగర్వాల్ టఫ్ నెడ్ గ్లాస్ ఇండియా, గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ కంపెనీలు ఉన్నాయి. వీటి సబ్ స్క్రిప్షన్(Subscription) వచ్చే వారం ప్రారంభం కానుంది. ఇక మరో నాలుగు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అవ్వనున్నాయి. ఇందులో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy), ఎన్విరో ఇన్ ఫ్రా(Enviro Infra), లామోసాయిక్ ఇండియా(Lamosaic India), సీ2సీ అడ్వాన్స్ సిస్టమ్స్(C2C Advance Systems) సంస్థలు ఉన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share