బ్లింకిట్, జెప్టోలకు బిగ్ షాక్.. క్విక్ కామర్స్ విభాగంలోకి మింత్రా ఎంట్రీ ..!

Ramesh

Ramesh

District Chief Reporter

మన దేశంలో గత కొంత కాలంగా క్విక్ కామర్స్(Quick Commerce) రంగానికి వినియోగదారుల నుంచి భారీగా ఆదరణ పెరుగుతోన్న విషయం తెలిసిందే. క్విక్ కామర్స్ సంస్థలు ఆయిల్(Oil) నుంచి మొదలుకొని స్మార్ట్‌ఫోన్స్‌(Smartphones) వరకు ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. ఇప్పటికే బ్లింకిట్(Blinkit), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌(Swiggy Instamart), జెప్టో(Zepto) వంటి కంపెనీలు క్విక్‌ కామర్స్‌ విభాగంలో సర్వీసులు అందిస్తుండగా.. తాజాగా ఈ రంగంలోకి ప్రవేశించేందుకు లైఫ్ స్టైల్(Life Style) ఈ-కామర్స్‌ దిగ్గజం మింత్రా(Myntra) ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు బెంగళూరు(Bengaluru)లోని ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందిస్తోంది. ‘ఎం-నౌ(M-Now)’ పేరుతో సెలెక్ట్ చేసిన పిన్ కోడ్స్(pin Codes)లో ముందుగా ఈ సర్వీస్ లను టెస్ట్ చేస్తోంది. ఇందులో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా ఇతర ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించాలనుకుంటున్నట్లు మింత్రా ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మింత్రా మెట్రో నగరాల్లో 2022లోనే మింత్రా ఎక్స్ ప్రెస్ డెలివరీ(Express Delivery) సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్డర్ చేసిన వస్తువులను 24 గంటల నుంచి 48 గంటల్లోనే డెలివరీ చేయడం దీని ఉద్దేశం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share