రికార్డు స్థాయిలో పెరిగిన బిట్‌కాయిన్ విలువ.. ఫస్ట్ టైం 99,000 డాలర్లు క్రాస్..!

Ramesh

Ramesh

District Chief Reporter

అమెరికా(America)లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత క్రిప్టో కరెన్సీ(Crypto Currency) బిట్‌కాయిన్(Bitcoin) విలువ క్రమ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ లో ఫస్ట్ టైం 99,000 డాలర్లు దాటి రికార్డు సృష్టించింది. త్వరలోనే బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా క్రిప్టో కరెన్సీల విషయంలో ట్రంప్ వైఖరి పాజిటివ్ గా ఉండొచ్చనే అంచనాలే ఈ కాయిన్ వాల్యూ పెరగడానికి కారణమని విశ్లేస్తున్నారు. గత రెండు వారాల్లో బిట్‌కాయిన్ విలువ 40 శాతం పెరిగింది. 2022లో 17,000 డాలర్లుగా ఉన్న క్రిప్టో కరెన్సీ వాల్యూ ఆ తర్వాత రెండేళ్లలో లక్ష డాలర్ల రికార్డు కు చేరువవ్వడం విశేషం. మరోవైపు మునుపెన్నడు లేని విధంగా బిట్‌కాయిన్ వాల్యూ పెరగడంతో సెంట్రల్ బ్యాంకులు(Central Banks) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ విలువ ఇలానే పెరిగితే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share