‘అదానీ’ వ్యవహారంపై రాజకీయ దుమారం.. కేంద్ర, రాష్ట్రాల రియాక్షన్

Ramesh

Ramesh

District Chief Reporter

అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీ(Adani)పై అమెరికా(US)లో కేసులు నమోదవడంపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడిగా గౌతం అదానీని భావిస్తుంటారు. అటువంటి పారిశ్రామిక దిగ్గజం చుట్టూ అమెరికాలో చట్టపరమైన ఉచ్చు బిగుస్తుండటాన్ని భారత్‌లోని కేంద్ర(Centre Govt), రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదానీ గ్రూపుపై అమెరికాలో కేసులు నమోదైనందున తాము స్పందించేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదానీ గ్రూపు వ్యవహారంలో పేర్లు వినిపిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై క్లారిటీ ఇస్తే సరిపోతుందని బీజేపీ వాదిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ ప్రస్తుతం ఫోకస్‌లో ఉన్నాయి.

‘‘అదానీ గ్రూపుతో తమిళనాడు విద్యుత్ శాఖ నేరుగా ఎలాంటి ఒప్పందాలను కుదుర్చుకోలేదు. 25 ఏళ్ల పాటు ఒక్కో యూనిట్‌కు రూ.2.61 చొప్పున వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్’తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ దీనిపై స్పందిస్తూ.. తమ హయాంలో అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో గత బీజేడీ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ మంత్రిగా వ్యవహరించిన పి.కె.దేవ్ స్పందిస్తూ.. అదానీ గ్రూపు నుంచి తాము ఎలాంటి ముడుపులూ తీసుకోలేదని తేల్చి చెప్పారు. నిరాధార ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్