సెన్సెక్స్ 30లోకి జొమాటో ఎంట్రీ.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల్లో కొత్తగా 43 స్టాక్స్ కు చోటు..!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) త్వరలో సెన్సెక్స్ 30(Sensex 30)లోకి ఎంట్రీ అవ్వనుంది. ఈ విషయాన్ని భారతదేశపు పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సూచీలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్(JSW Steel) ప్లేసులో జొమాటో రీప్లేస్(Replace) కానుందని, డిసెంబర్ 23 నుంచి ఈ కొత్త మార్పు అందుబాటులోకి రానుందని తెలిపింది. కాగా శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో షేర్ వాల్యూ 0.72 శాతం తగ్గి రూ. 265 వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో ఈ సంస్థ షేర్ విలువ ఏకంగా 136 శాతం పెరిగింది.

ఇదిలా ఉంటే సెన్సెక్స్ 30తో పాటు బీఎస్ఈ 100, బీఎస్ఈ 50, బీఎస్ఈ నెక్స్ట్ 50 సూచీల్లో కూడా బీఎస్ఈ(BSE) పలు మార్పులు చేపట్టింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు(F&O Contract)ల్లో కొత్తగా 43 స్టాక్స్(Stocks)కు అవకాశం కలిపించింది. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, యెస్ బ్యాంక్, వన్ 97 కమ్యూనికేషన్స్, డీమార్ట్ , జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ తదితర షేర్లు ఉన్నాయి. డిసెంబర్ 13 నుంచి ఈ కొత్త కాంట్రాక్టులు స్టార్ట్ కానున్నాయి. కాగా సెన్సెక్స్ మొత్తం 30 కంపెనీలను కలిగి ఉంటుంది. లిక్విడిటీ, మార్కెట్ క్యాపిటలైజేషన్, రాబడి, వైవిధ్యత ఆధారంగా ఈ 30 కంపెనీలను ఎంపిక చేస్తారు. అలాగే ఒక కంపెనీ సెన్సెక్స్‌లో ఉండాలంటే బిఎస్‌ఇలో లిస్ట్ అయి ఉండాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్