
ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు(Smart phones) ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్(WhatsApp) వాడుతున్నారు. ఉదయం గుడ్ మార్నింగ్(Good morning) మెసేజ్‌ల నుంచి మొదలు ఎన్నో ముచ్చట్లు వాట్సాప్‌లోనే పంచుకుంటారు. అయితే కొంతమంది ఫ్రెండ్స్(friends)తో చేసిన చాటింగ్ సీక్రెట్(secret)గా దాచాలనుకుంటారు. కాగా అలాంటి వారికోసం ఓ కొత్త ఫీచర్ వచ్చింది. అదే చాట్ లాక్ ఫీచర్(Chat lock feature).
మీ స్నేహితులతో పర్సనల్‌గా చేసిన చాటింగ్ అందులో భద్రంగా ఉంచుకోవచ్చు. అలాగే సీక్రెట్ కోడ్(Secret code)ను క్రియేట్ చేసుకొని మీ ప్రైవేట్ చాట్ ని రహస్యంగా దాచుకోవచ్చు కూడా. లాక్ చేసిన చాట్‌లను ‘లాక్డ్ చాట్స్(Locked chats)’ సెక్షన్‌లో చూడాలి. లాక్ చేసిన మెసేజ్‌లను సీక్రెట్ కోడ్ ఎలా ప్రొటెక్ట్(Protect) చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..