జైశ్వాల్ వరల్డ్ రికార్డు.. మెక్‌కల్లమ్ రికార్డు బద్దలు

Ramesh

Ramesh

District Chief Reporter

భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పెర్త్ టెస్టులో రెండో రోజు అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. సెంచరీ దిశగా వెళ్తున్న అతను 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే జైశ్వాల్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కొట్టిన రెండు సిక్సర్లతో జైశ్వాల్ ఈ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 34 సిక్సర్లు కొట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు.

ఇంతకుముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరిట ఉండేది. అతడు 2014లో 33 సిక్స్‌‌లు బాదాడు. తాజాగా మెక్‌కల్లమ్‌ను జైశ్వాల్ అధిగమించాడు. అలాగే, ఈ భారత యువ ఓపెనర్ మరో రికార్డుపై కన్నేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో 12వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అతను 1,170 రన్స్ చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్(1,338 రన్స్) అతని కంటే ముందున్నాడు. రూట్ కంటే జైశ్వాల్ కేవలం 168 రన్స్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌ను అతను అధిగమించి ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share