జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు ఇదే!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు ఇదే!

మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద సభ

భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన

ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘జయకేతనం’ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు తరలిరానున్నారని… ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరిగే ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందని మనోహర్ తెలిపారు.

ఈ ప్రాంతానికి విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా మూడు ముఖద్వారాలకు వారి పేర్లు పెట్టామని ఆయన వెల్లడించారు. తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టామని తెలిపారు. ఆయన విద్యాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎనలేని కృషి చేశారని వివరించారు.

రెండవ ద్వారానికి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేసిన దొక్కా సీతమ్మ పేరు పెట్టామని వెల్లడించారు. ఇక మూడవ ద్వారానికి విద్యాసంస్థలు స్థాపించి చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురు మహానుభావులు ఆయా ప్రాంతాలకు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ పేర్కొన్నారు.

భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు జనసేనకు అఖండ విజయాన్ని అందించారని మనోహర్ అన్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో జనసేన విజయం సాధించిందని, ఇది జనసైనికులు, వీర మహిళలు, నాయకుల నిస్వార్థ సేవలకు ఫలితమని ఆయన కొనియాడారు.

ఈ విజయాన్ని పురస్కరించుకుని, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 14న జరిగే ఈ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్