
వరాల మాసం రంజాన్
మైనార్టీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
కోరుట్ల, మార్చి 14 ప్రజావాణి
కోరుట్ల పట్టణంలో మైనార్టీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రంజాన్ మాసం సందర్భంగా రోజ స్వీకరించిన వారికీ కోరుట్ల రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యం అతిథిగా కోరుట్ల మైనార్టీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు అన్వర్ సిద్ధికి పాల్గొన్నారు .ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జీవితాన్ని, జీవిత గమనాన్ని పవిత్రంగా మార్చిమనసుకు ప్రశాంతతను ఇచ్చేదే రంజాన్ మాసం. మనసులోనే స్వర్గం అనుభూతిని కలిగించేది ఈ నెల అందుకే ఈ నెలలో అల్లా మానవత్వం, పవిత్రతతో బతకాలి. కఠినమైన ఉపవాస దీక్షలు పాటించాలి అంటారు పెద్దలు అంతేకాదు.ప్రార్థనలు, దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మికతతో జీవించాలి అనిచెప్తుంటారు. ఈ కార్యక్రమంలో ఖలీల్,మసిఉద్దీన్,సాజిద్,
జమీల్,రఫీ,అద్నాన్, బషీర్, హుస్సేన్ ,అజర్ ,లు విందులో పాల్గొన్నారు