
తహసీల్దార్ అడ్డగించిన ఆగని ఇసుక అక్రమార్కుడు
అక్రమ ఇసుక మాఫియా ముఠాల ఆగడాలు ఎన్నాళ్ళు ఎన్నేళ్లు..?
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. సాక్షాత్తు మండల తహసిల్దార్ అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునే నేపథ్యంలో ఓ ట్రాక్టర్ను తహసిల్దార్ అడ్డుకున్నారు. కానీ కారు అడ్డుపెట్టిన కానీ పట్టించుకోకుండా ఓ ఇసుక అక్రమార్కుడు రెవెన్యూ సిబ్బంది ముందు నుండి అతివేగంగా పరారైన ఉదంతం జరిగిందని తెలుస్తోంది. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం వద్ద మంగళవారం ఓ అక్రమ ఇసుక పంపు వద్ద అధికారుల ఎదుటే ఇసుకను అర లోడు చేస్తూ అతివేగంగా గంధసిరికి పరారు అయినట్లు తెలుస్తోంది. కాగా ముదిగొండ మండలంలో గత ప్రభుత్వ హయాంనుండి విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఉద్యోగ కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కనీసం రెవెన్యూ అధికారులు అనే ఆలోచన లేకుండా జంకు బంకు లేకుండా దర్జాగా పరారైన వ్యవహారం మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి ముదిగొండ మండలంలో విచ్చలవిడిగా గంధసిరి పెద్దమండవ కేంద్రాలుగా నడుస్తున్న ఇసుక మాఫియా పై శాఖపరమైన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.