ఐదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న మానససరోవర యాత్ర”

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఐదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న మానససరోవర యాత్ర”

దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం కానున్నది. ఈ యాత్రకు సన్నాహాలు జోరందుకున్నాయి. త్వరలోనే దీనిపై ప్రజానోటీసు జారీ చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. చైనాతో సంప్రదింపుల తర్వాత యాత్ర కోసం మార్గాలను తిరిగి రూపొందించడాన్ని పరిశీలిస్తుందని జైస్వాల్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. మానస్‌ సరోవర్‌కు మూడు మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల గుండా ప్రయాణానికి దాదాపు 14 రోజుల నుంచి గరిష్ఠంగా 21 రోజుల సమయం పడుతుంది.

సముద్ర మట్టానికి కైలాస మానసరోవరం 22వేల అడుగుల ఎత్తుల ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కింలోని నాథులా నుంచి 802 కిలోమీటర్లు, ఇక మూడు మార్గమైన నేపాల్ రాజధాని కాట్మండు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే, యాత్రలో పాల్గొనే పర్యాటకులంతా వందశాతం ఫిట్‌గా ఉంటే మాత్రమే ప్రయాణం చేయాలి. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి.

కైలాస పర్వతం..

కైలాస పర్వతం, మానస సరోవరం టిబెట్‌లో ఉంది. ఏటా వేలాది మంది కైలాస, మానస సరోవర యాత్రలో పర్యాటకులు పాల్గొనేవారు. ఈ యాత్ర కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది.

పలు దఫాలుగా చర్చల తర్వాత.. యాత్ర పునరుద్ధరించడంతో పాటు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక త్వరలోనే ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించనున్నారు. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్ర ఇప్పుడు ప్రారంభం కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్