
*చండూరులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు*
*నల్గొండ జిల్లా బ్యూరో చండూరు జూన్ 2 (మన ప్రజావాణి)*:
చండూరు మున్సిపాలిటీ లోని వివిధ ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఇంచార్జి రమణారెడ్డి, ఎమ్మార్వో కిరణ్మయి, డిప్యూటీ ఎమ్మార్వో నిర్మలదేవి, ఎంపీడీవో బి యాదగిరి, వివిధ ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.