రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…?

అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…?

ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..?

ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…!

అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…?

ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..?

ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

మన ప్రజావాణి ప్రత్యేక కథనం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మన ప్రజావాణి

టైర్లను బట్టి రేట్లు ఉంటాయి ఇక్కడ ఓ బిల్ల చూపిస్తే చాలు రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ.. అంతా మామూళ్ల మత్తుతో జోగుతున్న చెక్పోస్ట్ అధికారులు సిబ్బంది.. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు అశ్వరావుపేట చెక్పోస్ట్ సిబ్బంది అవినీతికి హద్దు పద్దు లేకుండా కొనసాగుతోంది. ఎన్నిసార్లు ఏసీబీ దాడులు నిర్వహించిన సంబంధిత అధికారులు తమ తీరును మార్చుకోకపోవడం విశేషం. ఆరు టైటిల్ వాహనానికి 200 రూపాయలు అదే పది టైర్ల లారీ కానీ వాహనం అయితే 400 12 టైర్ల లారీలకు వాహనాలకు 600 14 టైర్లకు 500 16 నుండి మాత్రం 800 నుంచి 1000 రూపాయల దాకా సమర్పించుకున్న తరువాతనే వాహనాలు అటు వెళ్లాలన్నా ఇటు రావాలన్నా ముడుపులు ముట్ట చెప్పాల్సిందే. ఇది నిత్యం షిఫ్టులు వారీగా జరుగుతున్న యదార్థం మని ఆంధ్ర తెలంగాణ వాహనదారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు రెండు లక్షల రూపాయల మేర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చేపల వాహనాలు దానా పశువులు రవాణా ఏదైనా ముడుపులు చెల్లించాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చెక్ పోస్ట్ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి మాత్రం ఆ దరిదాపుల్లో కనిపించారు కానీ వ్యవహారమంతా చెక్ పోస్ట్ సిబ్బంది అధికారులు నిర్ణయించిన రేట్లు ప్రకారం ముడుపులు చెల్లించుకొని ముందుకు వెళ్లాలన్నా వెళ్ళకు రావాలన్నా ఇదే రూల్ ఇదే సిద్ధాంతం. అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్న సంబంధిత రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి అధికారులు స్పందించకపోవడం దృష్టి కేంద్రీకరించకపోవడం విశేషం.

*ప్రైవేటు వ్యక్తుల పహారాలో వసూళ్ల పర్వం..?

కాగా షిఫ్టుల వారీగా విధులు నిర్వహించే సిబ్బంది అధికారులు కాసులకు కక్కుర్తి పడి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేసి లెక్క ప్రకారం ఆయా షిఫ్టులో ఉన్న సిబ్బందికి అధికారులకు లెక్క ప్రకారం అప్పగిస్తూ నిత్యం ఇదే తీరుగా వ్యవహరిస్తున్నట్లు వాహనదారులు యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను సైన్యంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చెక్ పోస్ట్ నిర్వాహకులపై లారీ యజమానులు వాహనదారులు అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు అశ్వరావుపేట అక్రమంగా వస్తువులపై దృష్టి కేంద్రీకరించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు యజమానులు కోరుతున్నారు..

మరికొన్ని అక్రమ దందాలపై తరువాయి కథనంలో వేచి చూడండి…2లో….!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share