*జిల్లాతో నాకెంతో ప్రత్యేక అనుబంధం* *సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్య*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*జిల్లాతో నాకెంతో ప్రత్యేక అనుబంధం*

*సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్య*

*హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం*

హనుమకొండ జిల్లా ప్రతినిధి //మన ప్రజావాణి

హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా పని చేసిన ఈ ప్రాంతం తనకేంతో ప్రత్యేకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న పి.ప్రావీణ్య అన్నారు.ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న పి.ప్రావీణ్య ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన బెంగళూరు తర్వాత ఎక్కువ కాలం ఉన్న ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. జీవితంలో ఈ ప్రాంతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని అన్నారు. మున్సిపల్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా అందరి సహకారంతో సమన్వయంతో పనిచేయడం పట్ల జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు క్రమం తప్పకుండా అధికారులతో సమావేశాలను నిర్వహించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉండడంతో తరచుగా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఎక్కువ సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని విజయవంతంగా అమలు చేయడంలో అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు, సమావేశాలు అధికారులు, ఉద్యోగులతో విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వ పథకాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో అందరి సహకారం ఉందన్నారు.
తన దృష్టికి ఏ విషయం వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదన్నారు. మున్సిపల్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా దీర్ఘకాలం పనిచేసిన ఈ ప్రాంతాన్ని జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని అన్నారు. ఎక్కడ ఉన్నా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. పరిపాలనలో జిల్లా ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, నాయకులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో నిలిపేందుకు కలెక్టర్ ప్రావీణ్య ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయా శాఖలను, అధికారులు, ఉద్యోగులను ముందుకు నడిపించారని అన్నారు.ఆత్మీయ వీడ్కోలు సమావేశం అనంతరం వివిధ శాఖల అధికారులు, టీజీవో, టీఎన్జీవో, వివిధ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గజమాలలు, పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, టీఎన్జీవో అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ఇతర సంఘాల నాయకులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share