
*కోరుట్లలో నూతనంగా ప్రెండ్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు*
కోరుట్ల,ఆగస్టు 25(ప్రజావాణి)
కోరుట్లలో వున్న మన ప్రెస్ క్లబ్, మా ప్రెస్ క్లబ్ లు రెండు ఎకమై నూతన సభ్యులతో కలిసి నూతనంగా ప్రెండ్లి ప్రెస్ క్లబ్ కోరుట్ల గా ఏర్పాటు చేయడం జరిగింది.
సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా చిలువేరి లక్ష్మీ రాజం, అధ్యక్షుడిగా ఉరమండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గా పెడిమల్ల రాజు, కోశాధికారిగా తీగల శోభన్ రావు ఉపాద్యక్షులుగా మిర్జా ముఖ్రమ్ బైగ్, వనతడుపుల నాగరాజు , సహయ కార్యదర్శులుగా షేక్ రహీం, సైదు గంగాధర్, ప్రచార కార్యదర్శి కత్తిరాజ్ శంకర్ లను ఎన్నిక చేయడం జరిగింది. ప్రజాప్రయోజనలతో పాటు పాత్రికేయుల సమస్యలు పరిష్కారానికై ఈ రెండు సంఘాలను ఎకం చేసినట్లు అ అంశాలే ప్రధాన లక్ష్యంగా ఈ నూతన కమిటీ పని చేయాలని సీనియర్ పాత్రికేయులు రాదారపు నర్సయ్య, అలీ నవాబ్, పేట భాస్కర్,అల్లే రాములు అశాభావం వ్యక్తం చేశారు.