
నయారా పెట్రోల్ బంక్ లో… జరిగిన మోసం.. ఆ సామాన్యుడికి న్యాయం దక్కేనా…?
ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కు బదులుగా డీజిల్ కొట్టారా..?
రంగంలోకి దిగిన నయారా రాష్ట్ర అధ్యక్షుడు సైతం హామీ..?
ద్విచక్ర వాహనానికి ఆయన నష్టాన్ని భరించేందుకు అంగీకరించని యాజమాన్యం..
ఎర్రుపాలెం మీనవోలు పెట్రోల్ బంకులో దౌర్జన్యకాండ
పర్యవేక్షణ లేని అధికారులు.. కన్నెత్తి చూడని యంత్రాంగాలు…!
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని ఓ నయారా పెట్రోల్ బంక్ సిబ్బంది హీరో హోండా ద్విచక్ర వాహనానికి పెట్రోల్కు బదులు డిజిల్ను కొట్టారు. అది కూడా 50 రూపాయలు కాదు.. అక్షరాల 260 రూపాయలు సదరు బాధితుడు ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత బాధితుడి ద్విచక్ర వాహనం స్తంభించిపోయింది.. దీంతో సదరు బాధితుడు పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ద్విచక్ర వాహనానికి జరిగిన నష్టానికి నగదు చెల్లిస్తాం రిపేర్ చేపిస్తాం అంటూ ఓ హీరో హోండా షోరూం వాళ్లకు ఫోన్ చేసి కేవలం సర్వీస్ చేయండి అంతేగాని ద్విచక్ర వాహనంలోని పనిముట్లు ఆగమైతే మాత్రం చేయకండి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో సదరు బాధితుడు తన సొంత డబ్బులు సుమారు 15 వేల రూపాయలు చెల్లించుకొని అట్టి ద్విచక్ర వాహనాన్ని రిపీట్ చేసుకున్న నేపథ్యం. ఇదే విషయంపై నయారా రాష్ట్ర అధ్యక్షుడుకు సదరు బాధితులు ఫిర్యాదు చేశారు. కుమార్తె కళ్యాణమున్నది త్వరలో న్యాయం చేస్తాము ఇబ్బంది లేదు అంటూ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మే
మీ నవోలు నయారా పెట్రోల్ బంక్ యాజమాన్యానికి తెలియజేసి పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ చేసేదేమీ లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సదరు బాధితుల్ని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పై మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి పూర్తి వివరాలు సేకరించారు.
ఇంతకీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు ఉంటాయా ? సంబంధిత బాధితుడికి న్యాయం దక్కుతుందా అనేది భవిష్యత్తులో తేలనున్నది మరికొన్ని వివరాలతో రేపటి కథనం..2లో వేచి చూడండి…!








