ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు* రాయికల్: నవంబర్ 19 (ప్రజావాణి)

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు*

రాయికల్: నవంబర్ 19 (ప్రజావాణి)

రాయికల్ పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ లో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 108వ జయంతి ఉత్సవాలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….ఇందిరా గాంధీ నవంబర్ 19 1917లో జన్మించారని అన్నారు.ఇందిరాగాంధీ 1966లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రజలకు చేరువగా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని, బ్యాంకుల జాతీయకరణ, పంటల ఉత్పత్తి పెంచటం కోసం హరిత విప్లవాన్ని అలాగే పేదరికం పారద్రోలడానికి గరీబ్ హటావో నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువైందని అన్నారు.గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎన్నో గృహాలను నిర్మించి ఇవ్వడం జరిగిందని అన్నారు.అలాగే సాగునీటి కోసం కాలువలను తవ్వించి ప్రతి మారుమూల ప్రాంతానికి సాగునీరు అందించి పంటల ఉత్పత్తి పెరగడానికి దోహదపడి హరిత విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లారని, అలా ఉక్కు మహిళగా పేరు పొందిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి ఉత్సవాలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజరెడ్డి, పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య, మండ రమేష్,శేఖర్,ఏలేటి జలంధర్ రెడ్డి,నరేష్, రాజేందర్ రెడ్డి,రాజీవ్, నాగరాజు,షాకీర్,జగదీశ్వర్ రెడ్డి,శివ,జలపతి,సాగర్, రాకేష్ నాయక్, గుమ్మడి సంతోష్, రమేష్ నాయక్, మల్లేష్,నవీన్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్