
*పోశమ్మ గండి దర్శనానికి వెళ్లిన భక్తులకు ప్రమాదం*
*టాటా ఏస్ బోల్తా పలువురికి గాయాలు*
*ఒక్కరి పరిస్థితి విషమం*
ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం నవంబర్ 30
దేవీపట్నం మండలం పరిధిలో దుర్ఘటన జరిగింది. పోశమ్మ గండి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం పురుషోదపట్నం సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక్కరి పరిస్థితి తీవ్రమైనదిగా వైద్యులు వెల్లడించారు.
వివరాల్లోకెళ్తే… పోచమ్మ గండి దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వాహనం నియంత్రణ తప్పి రహదారికి పక్కన ఉన్న రాయ ఢీకొని బోల్తా పడ్డట్లు సమాచారం.
ప్రమాద శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీశారు. అనంతరం వారిని అంబులెన్స్‌లో సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి తరలించారు. కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ఏరియా హాస్పిటల్‌కు రిఫర్ చేసినట్లు సమాచారం.








