FLASH NEWS

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

* తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి.. వీరభద్రం సీనియర్ జర్నలిస్ట్ మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు హోరెత్తనున్నాయి. ఈరోజు సాయంత్రం హనుమకొండ వేయి స్తంభాల గుడిలో నిర్వహించే ఆరంభ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు హాజరవుతున్నారు. ఇప్పటికే వేయిస్తంభాల గుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు. నగర మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ కోరారు. *బతుకమ్మ పూల పండుగకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు…! పూల పండుగ సందర్భంగా రాష్ట్ర ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1 స్టేట్ బ్యూరో ప్రతినిధి (మన ప్రజావాణి) చైతన్యమంతమైన ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ వైద్య సేవలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి దర్జాగా కార్పొరేట్ శక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కట్టడాలు నిర్మాణం చేస్తున్న సంబంధిత కార్పొరేషన్ శాఖ అధికారులు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి అట్టగోలుగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఖమ్మం నగర ప్రజలు విమర్శిస్తున్నారు. కరోనా కల్లోలంలో దండిగా దండుకున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎక్కడో మారుమూల పల్లె కాదు గిరిజన తండా కు గ్రామం అంతకంటే కాదు జిల్లా కేంద్రంలో అధికారుల ఉదాసీనత చర్చనీయాంశంగా మారింది.. మరికొన్ని వివరాలతో.. వరుస కథనాల పరంపర రేపటి కథనం..2లో.. వేచి చూడండి…!

హౌసింగ్ బోర్డ్ కాలనీలో మహోన్నత ఉచిత వైద్య శిబిరం

హౌసింగ్ బోర్డ్ కాలనీలో మహోన్నత ఉచిత వైద్య శిబిరం * డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో జమ్మికుంట సెప్టెంబర్ 16 (ప్రజావాణి) వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీలో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది.ఈ వైద్య శిబిరంలో 54 మంది కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగినది,ఇద్దరు జ్వర పీడితులను గుర్తించి వ్యాధి నిర్ధారణకి ల్యాబ్ కు పంపించడం జరిగింది,ఈ వైద్య శిబిరాలకు వచ్చిన కాలనీ వాసులకు అసంక్రామిత వ్యాధులు రక్త పోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వైద్య శిబిరాలకు వచ్చిన కాలనీవాసులకు హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సీజనల్ వ్యాధులు మలేరియా,డెంగీ, చికెన్ గున్య మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించి చెప్పడం జరిగింది. వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత డ్రై డే ల పై అవగాహన కల్పించనైనది. మహిళలకు ఆరోగ్య మహిళా ప్రోగ్రాం పై అవగాహన కల్పించనైనది. దోమల నివారణ మరియు అవి కుట్ట కుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కాలనీ వాసులకు అవగాహన కల్పించనైనదిఈ కార్యక్రమములో డాక్టర్ మహోన్నత పటేల్,హెల్త్ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ అరుణ,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు మంజుల,రజిత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంటలోప్రధమశ్రేణిజుడిషియల్.మెజిస్ట్రేట్.కోర్టుజూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని

జమ్మికుంటలోప్రధమశ్రేణిజుడిషియల్.మెజిస్ట్రేట్.కోర్టుజూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని * నియోజకవర్గంఇంచార్జి ఒడితల ప్రణవ్ ను కలిసిన న్యాయవాదులు జమ్మికుంట సెప్టెంబర్ 16 (ప్రజావాణి) హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు ని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన న్యాయవాదులు కలసి జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాలను కలుపుకొని జమ్మికుంటలో ప్రధమ శ్రేణి జుడిషియల్.మెజిస్ట్రేట్.కోర్టుజూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని, ప్రణవ్ బాబు ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి జమ్మికుంటలో కోర్టు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని న్యాయవాదుల కు అందరికీ నమ్మకం ఇవ్వడం జరిగింది. జమ్మికుంటలో మున్సబ్ మెజిస్ట్రేట్ కం జూనియర్ సివిల్ జడ్జి కోర్టును నెలకొల్పాలని ఉమ్మడిగా 30 మంది న్యాయవాదులు కలిసి మెమోడల్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మోలుగూరి సదయ్య, ఏ బూసి లింగారెడ్డి, పొట్లపల్లి శ్రీధర్ బాబు, నక్క సత్యనారాయణ, , మొలుగూరి సదయ్య, హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్, కనకం తిరుపతి, ముంజల విజయ్ , పింగిలి రమేష్ , సుకన్య, శ్రీరామ్ శిరీష, అబ్బరవేణి రాజు, వంశీకృష్ణ గూడెపు, అప్పని రాజు, పిట్టల రాజేష్, ముంజాల విజయ్, మోరే కళ్యాణ్, గుండ వరప్రసాద్, నవీన్ కుమార్, మారపల్లి శ్రీధర్, దూడపాక శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.

*జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి* *చండూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి

*జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి* *చండూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి)*: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చండూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం ఉమ్మడి జిల్లా టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివ రావు పై ఖమ్మం పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చండూరు మండల కేంద్రoల్లో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులతో కలిసి చండూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజంలో ఉన్న సమస్యలను, తప్పు ఒప్పులను వెలికితీస్తున్న జర్నలిస్టులను ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అతి ముఖ్యమైన సమస్య యూరియా, రైతులు యూరియా దొరకక తెల్లవారుజాము నుండి ఎండకు వానకు సహకార బ్యాంకుల వద్ద గ్రోమోర్ కేంద్రాల వద్ద లైన్లు నిలబడి కొంతమంది చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి అనేక సమస్యలను ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో ఇంచార్జ్ సాంబశివరావు వెలికి తీసి ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం వల్ల ఆయనను అక్రమంగా అరెస్టు చేసి నాన్ వెలబుల్ వారెంట్ ఇష్యూ చేసి జైల్లో పెట్టడం ప్రభుత్వానికి ఇది తగదు అని హెచ్చరించారు. ఒకవైపు రైతులను ప్రజలను సమస్యల గురించి ప్రశ్నిస్తే ఇంకొక వైపు ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్గా ఉన్నటువంటి మీడియా జర్నలిస్టులను కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని, ఇలాంటి అక్రమ కేసులకు జర్నలిస్టులు భయపడతారని అనుకోవడం ప్రభుత్వం అవివేకం అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టి ఒత్తిళ్లకు గురిచేసిన భయపడేది లేదన్నారు. అదేవిధంగా చండూరు ప్రెస్ క్లబ్ సలహాదారులు రాపోలు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి తెలియపరుస్తున్న జర్నలిస్టులను ఏదో దొంగలుగా, తప్పు చేస్తున్నటువంటి దోషులుగా నిర్ధారిస్తూ వారిపై ఇలాంటి కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. సమాజం కోసం అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టులకు బాగు కోసం ఏదో రకంగా ప్రభుత్వాలు ఉపయోగపడాలి తప్ప ఇలాంటి చర్యలకు ఉపక్రమించోద్దన్నారు. ఇలాంటి చర్యలకు భయపడకుండా సమాజంలో ఉన్న సమస్యలను ఇంకా బలంగా వెలికి తీసి ప్రజలకు తెలియపరచి ఆ సమస్యకు పరిష్కార దిశంగా ముందుకు కొనసాగుతామని అన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకుంటే మునుముందు ఇంకా ఆందోళన కార్యక్రమాలను వృద్ధుతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు చండూరు మండలం ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలు ఘనంగా చెయ్యాలి మఠం శాంతకుమారి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలు ఘనంగా చెయ్యాలి మఠం శాంతకుమారి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ప్రజావాణి ప్రతినిధిపాడేరు సెప్టెంబర్ 15 : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సేవా పక్వాడా కార్యశాల బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంతకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బీజేపీ ఎన్డీయే ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75 వ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు పక్షం రోజు చెయ్యలని ఇందులో జిల్లా స్థాయిలో రక్త దాన కార్యక్రమంలో 17 న ,ఉచిత వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంప్ లు ,పాఠశాల ,దేవాలయాలు ,ఆసుపత్రిలో స్వేచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్నారు,అదేవిధంగా అమ్మ పేరుతో మొక్కలు నాటాలిఅన్నారు,సెప్టెంబర్ 25 న దీన్ దయల్ ఉపాధ్యాయ జీవితం పై సెమినార్ నిర్వహించాలి అన్నారు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా చెయ్యాలి అన్నారు, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు పాంగి రాజారావు, సేవా పక్వాడా జిల్లా కో కన్వీనర్ రవికుమార్ పెనుమాక, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందోలి ఉమా మహేష్,సల్లా రామకృష్ణ,సేవా పక్వాడా మండల ఇంచార్జీ కుడుముల వెంకట రమణ,సరభ వేమనబాబు, మత్యకొండబాబు, లకే భాస్కర్,పాపిటి రాజు,లకే అబ్బాయి దొర తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల కు పీహెచ్డీ, గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేసిన – గవర్నర్

*మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల కు పీహెచ్డీ, గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేసిన – గవర్నర్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి)*: విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని, దార్శనికత, విలువలు శ్రేష్ఠత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం లో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాలుగవ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. ముందుగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద రాష్ట్ర గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, నారాయణ అమిత్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన నాలుగవ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం వద్ద మొక్కలు నాటారు. అనంతరం 22 మందికి పీహెచ్ డి అవార్డులను, 57 మందికి గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం ఛాన్స్లర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ విద్యారంగం, పరిశోధన, ఆవిష్కరణలు మరియు సేవా కార్యకలాపాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్న మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం గ్రామీణ వాతావరణంలో ఉంటూ తెలంగాణ అంతటా గ్రామాల నుండి ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తున్నదని అన్నారు. చాలామంది మొదటి తరం అభ్యాసకులు, వారు సహజమైన ప్రతి బంధకాలతో ఇక్కడికి వచ్చి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అయినప్పటికీ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వారికి ఎదగడానికి ఒక పోషణ వేదికను నిరంతరం అందిస్తున్నదన్నారు. అడ్డంకులను అధిగమించి, బాధ్యతాయుతమైన, ఉత్పాదక మరియు విజయవంతమైన పౌరులుగా తమను తాము మార్చుకుంటున్నారని తెలిపారు. విద్యార్థుల హాజరును బలోపేతం చేయడం, హాస్టల్, క్యాంపస్ సౌకర్యాలను మెరుగుపరచడం, సమ్మిళిత అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడం పై మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం చూపుతున్న దృష్టి లోతైన ప్రశంసలకు అర్హమైనదని, గ్రామీణ యువతను ఉద్ధరించడం లో సమాజంలో అర్థవంతమైన భాగస్వామ్యం కోసం వారిని సిద్ధం చేయడంలో యూనివర్సిటీ పాత్ర నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు. ఒక దశాబ్దానికి పైగా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతి నిర్మాణానికి గణనీయంగా దోహదపడిన గ్రాడ్యుయేట్ల ను తయారు చేస్తున్నదని, విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థగా తీర్చిదిద్దడంలో బలమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ల ను పెంపొందించడం కొనసాగించాలని, వారి మద్దతును ఉపయోగించుకోవాలని అన్నారు. న్యాక్ అక్రెడిటేషన్ గుర్తింపులు యునివర్సిటీకి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా సంస్థ పెరుగుతున్న ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తాయని అన్నారు. దేశ పురోగతి దాని గొప్ప వనరు – దాని మానవ ప్రతిభ యొక్క స్థిరమైన ఉపయోగం పై ఆధారపడి ఉంటుందని పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు దీనికి కీలకమని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సవాలు తో కూడిన సమయంలో, ముఖ్యంగా వ్యాక్సిన్ అభివృద్ధి మరియు ప్రపంచ ఆరోగ్య మద్దతు లో భారతదేశం సాధించిన విజయాలు మన బలాన్ని ప్రదర్శించాయని, ప్రస్తుతం భారతదేశం బహుళ రంగాలలో రాణిస్తోందని, గ్రామీణ ప్రాంతాలతో సహా విశ్వవిద్యాలయాలు యువ మనస్సులను సృజనాత్మకత, ఆవిష్కరణలతో పెంపొందిస్తాయి కాబట్టి ఇటువంటి విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ఐదు ట్రిలియన్ డాలర్ల మైలురాయి వైపు క్రమంగా ముందుకు సాగుతోందని త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.అభివృద్ధి సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే ఈ పెరుగుదల అర్థవంతంగా ఉంటుందని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వంటి విశ్వవిద్యాలయాలు సమ్మిళిత వృద్ధికి కీలకంగా మారుతుందని, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ లో భారతదేశం ర్యాంక్ 2015 లో 81 వ స్థానంలో ఉండగా ఇటీవలి సంవత్సరాలలో 39 వ స్థానానికి మెరుగుపడిందని గమనించడం సంతోషంగా ఉందని, ఈ పురోగతి పెరుగుతున్న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ ను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు విద్యార్థులను కొత్త సాంకేతికతలకు, ముఖ్యంగా పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చేయాలని కోరారు.డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం చెప్పినట్లుగా: “కలలు కనండి, కలలు ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి మరియు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయన్నారు.”ప్రతి ఒక్కరు వీటిని పాటించాలని సూచించారు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనలను ప్రోత్సహించాలని ఇంజనీరింగ్ విభాగంలో చేయూతనివ్వాలని అన్నారు ప్రతి విద్యార్థి చదివే సబ్జెక్టులో డిగ్రీ తనకి ఇష్టమైన అంశంలో సైతం మరో డిగ్రీ సాధించాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు నూతన ఆవిష్కరణల పై దృష్టి సారించాలని అన్నారు. ఇంజనీరింగ్ విద్య విద్యార్థులను ఉత్పాదకత వైపు అభివృద్ధి చేయడమే కాకుండా దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. నీకోసం మీరు పని చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడారు. గవర్నర్ ఏ డి సి భవాని ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, యూనివర్సిటీ అధ్యాపక బృందం, తదితరులు, ఈ కార్యక్రమానికి హాజరు కాగా, నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..? *బాధితుల ఆరోపణలు ఆధారాలతో మన ప్రజావాణి వరుస కథనాలు మీకోసం…! *వేములవాడ రాజన్న సాక్షిగా అక్రమాలకు అధికారులు చెక్ పెడతా రా..? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ యంత్రంగం.. చొరవ తీసుకోవాలని బాధితులు… కోరుకుంటున్నారు… స్టేట్ బ్యూరో మన ప్రజావాణి *అధిక వడ్డీలు. అమాయకుల భూములను తాకట్టు పెట్టుకొని కొన్నిచోట్ల బంగారం నగలు పుస్తెలను అడ్డగోలుగా స్వాధీనం చేసుకుంటూ బడుగు జీవుల ప్రతాపం చూపుతున్న వడ్డీ వ్యాపారులపై మన ప్రజావాణి సమగ్ర సంచలన కథనం ఎంత ఆపదైతే మాత్రం భూములు తనకా చేసుకోని అధిక వడ్డీలకు దందా లు చేస్తారా…? కొన్నిచోట్ల భూములు తనకా రిజిస్ట్రేషన్ చేసుకుని మరికొన్ని చోట్ల బంగారం పుస్తెలతాడులు తనకా చేసుకోని పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతుందని విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. పేరుకు నామమాత్రం వడ్డీ అని చెప్పేసి అప్పులు ఇచ్చి భూములు బంగారం తనఖా పట్టించుకోని పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్న బిన్నం చేస్తున్న వ్యవహారం అది కూడా జిల్లా కేంద్రంగా జరగడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆర్.బి.ఐ నిబంధన ప్రకారం వ్యాపారం చేస్తున్నారా చేయటం లేదా అనేది ప్రభుత్వ యంత్రాంగాలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంట్లో కొన్ని శాఖల అధికారులు జోక్యం చేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నట్లు దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన బడుగు జీవులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మాక్రోఫైనాన్స్ మాయలో పడి ఎంతోమంది ప్రజలు అధిక వడ్డీలు చెల్లించలేక తనువులు సారిం చి నవేళ నేటి ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితిపై బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా లేకుండా వదిలేస్తారా అనేది భవిష్యత్తులో తేలనున్నది ఈ వ్యవహారంపై బాధితుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు అగ్రిమెంట్లు లాంటి పూర్తి ఆధారాలతో.. మన ప్రజావాణి రెండో కథనంలో వేచి చూడండి….!

*కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల తో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్

*కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల తో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి)*: నల్గొండ జిల్లాను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం అయన మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నాల్గవ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదీత్య భవన్లో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముందుగా రాష్ట్ర గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ…… నల్గొండ జిల్లాలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో వైటిపిఎస్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య, విద్య, జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్, భవిత కేంద్రాలు గ్రామ సడక్ యోజన, టి బి ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఆబ జన జాతీయ యోజన, ఆది కర్మయోగి అభియాన్, తదితర పథకాల పై లెక్కలతో సహా వివరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతల పై వివరాలను తెలియజేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు లయన్ డిస్టిక్ గవర్నర్ మదన్ మోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, వైద్యులు జయప్రకాశ్ రెడ్డి, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా, కవి సగర్ల సత్తయ్య, దుశ్చర్ల సత్యనారాయణ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణ కాంత్ నాయక్, రైతు రాంరెడ్డి,పదవతరగతి జిల్లా టాపర్ విద్యార్థిని అమూల్య, హెచ్ఐవి పై పనిచేస్తున్న సంఘసంస్కర్త మేరీ తదితరులు వారు చేస్తున్న రంగాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు. జిల్లా అధికారులతో ముఖాముఖి సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాసులు జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, చికిత్స, తదితర అంశాలను వివరించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ క్షయ వ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నివారణకు సొసైటీలో అందరినీ భాగస్వామ్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కవులు, కళాకారులు , రచయితలు వివిధ రంగాలలోని ప్రముఖులను టీబి ముక్త్ భారత్ లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబి ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి సూచించారు. టి బి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబి ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, గ్రామాలలో సర్పంచ్ లను చురుకుగా పాల్గొనే విధంగా చూడాలని, కవులు, కళాకారులు, రచయితల ద్వారా సాంఘిక నాటకాలు, నాటికలు, పద్యాలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని, టీబి కి వ్యతిరేకంగా అందర్నీ భాగస్వాములు చేయాలని సూచించారు. అలాగే నల్గొండ జిల్లాలో గాంజా ఎక్కువ మొత్తంలో ఉందని తెలుసుకొని గాంజా నిర్మూలనలో సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ రెండు అంశాలపై తో పాటు, మహిళా సాధికారతకు కృషి చేయాలని, ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కళాకారులు, కవులు, పర్యావరణవేత్తలు సైతం టీబీ ముక్తు భారత్ లో పనిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయ వీసీలు మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ భాగస్వాములు అయితే టీబి, మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించవచ్చని, అప్పుడు నల్గొండ జిల్లాను టీబి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్ద వచ్చని అన్నారు. ముఖ్యమైన పథకాల అమలులో గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి మారుమూల గిరిజన ప్రాంతాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో చివరి మనిషి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖులు వారు సొసైటీకి ఏం చేయగలమో ఆలోచించాలని, ఈ విషయంపై ఎంపీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని పునరుద్గాటించారు. నల్గొండ జిల్లాలో వైద్యం, ఆరోగ్యం, విద్య పథకాల అమలు పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. అలాగే పోషణ అభియాన్ తో పాటు, ఇతర పథకాలు బాగా అమలు చేస్తుండడం పట్ల కితాబునిచ్చారు. పౌష్టికాహారం టి బి నివారణ, మాదకద్రవ్య నివారణ, తదితర పథకాలలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపీ రఘువీర్రెడ్డిలు రాష్ట్ర గవర్నర్ ను శాలువా, మేమేంటోతో సత్కరించారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు నల్గొండ జిల్లాలో టీబి నివారణకు ముఖ్యుల సలహాలు తీసుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగంతో కలిసి పని చేస్తామని అన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద రైస్ మిల్లు ఇండస్ట్రీ ఉందని, దీనివల్ల వాతావరణ కాలుష్యం ,టీబి వంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉందని ,ఆ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి టీబి నివారణకు కృషి చేస్తామన్నారు. అలాగే పట్టణాలలో గాంజా వాడకం ఎక్కువగా ఉందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డిఎఫ్ఓ రాజశేఖర్ ,రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు , తదితరులు పాల్గొన్నారు.

 Share

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1