
“ఫిర్యాదుదారుని చేత వేయబడిన చేసిన సిసి రోడ్ పనికి సంబంధించిన పెండింగ్లో ఉన్న రూ.11,00,000/- బిల్లులను ఆమోదించేందుకు” అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.1,30,000/- లంచం డిమాండ్ చేసి అందులోనుండి రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని నాగరం పురపాలక కార్యాలయపు ఉప కార్యనిర్వాహక ఇంజనీరు – సుదర్శనం రఘు మరియు వర్క్ ఇన్స్పెక్టర్లు (ఔట్సోర్సింగ్)-వి.రాకేష్ & వి. సురేష్.”
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)” ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.”