
రాజన్న సిరిసిల్ల జిల్లా లో మోటార్ల దొంగతనాల కలకాలం.
••రైతుల మోటార్ల దొంగతనం చేసిన దుండగులు.
•••ఇరు మండలాల చివారు ఒకటే కావడం తోనే సులువు..?
•••లబోదిబో మంటున్న రైతులు…!
రాజన్న సిరిసిల్ల జిల్లా //మన ప్రజావాణి
అర్ధరాత్రి వేళల్లో రైతుల పొలాల దగ్గర మోటార్లను గుర్తుతెలియని దుండగులు దొంగలించిన ఘటన రాజన్న సిరిసిల్ల లో జరిగింది.
*స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం*…. తంగళ్ళపల్లి మండలం లో నిన్న రాత్రి సమయం లో చింతల్లపల్లె గ్రామానికి చెందిన ముగ్గురి రైతుల పొలాల దగ్గర 3 మోటార్లు, గండి లచ్చపేట గ్రామం లో 1,చొప్పున దొంగలిచ్చినట్లు తెలిపారు. అదేవిదంగా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నల్ల నర్సవ్వ 1,బోడెల్లి పెద్ద ఎల్లయ్య 1,బోడెల్లి మల్లయ్య 1,చొప్పున రైతుల మోటార్ల దొంగలించారని ఆవేదన వ్యక్తం చెస్తున్నారు.నాట్లు వేసే సమయం లో మోటార్ల ను దొంగలించడం తో చేతులు ఆడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరు మండలాలు ఒకే చివారు కావడం తో దొంగతనానికి సులువు కావడం అయిందని రైతులు చెప్తున్నారు. ఇరు మండలల పోలీసులు స్పందించి దొంగతనాలకు పాల్పడిన దుండగులను పట్టుకొవాలని కోరుతున్నారు.