
ఏడు వైద్యశాలను షీజ్ చేసిన డిప్యూటీ డి ఎం ఎచ్ ఓ
షాబాద్ జూలై 9
(మన ప్రజావాణి )
షాబాద్:మండల కేంద్రంలోని ఏడు ప్రైవేటు వైధ్యశాలలను మంగళ వారం రంగారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేందర్ సీజ్ చేశారు. గత నాలుగు రోజులుగా క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ కుమార్ తనికి చూసి వైద్యం చేయకూడదని హెచ్చరించిన పట్టించుకోకుండా వైద్యం చేసిన ఏడు గురు నకిలీ వైద్యులు ఆసుపత్రులను డిఎంహెచ్వో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ డాక్టర్,ఆస్పత్రి సిబ్బంది సహాయంతో తనిఖీ నిర్వహించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రథమ చికిత్స కేంద్రాలు అంటే కేవలం గాయాలకు చిన్నచిన్న రోగాలకు మాత్రలు మాత్రమే ఇవ్వాలన్నారు కానీ సూదులు,సెలైన్ బాటిల్ పెట్టే అధికారం వారికి లేదని తెలిపారు. సీజ్ చేసిన వైద్యశాలను తిరిగి తెరిచిన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తాము వైద్యలమేనని నిరూపించడానికి తగిన పత్రాలు డిఎంహెచ్వో అధికారికి సమర్పించాలని తెలిపారు.లేని యెడల వాటిని తెరవడానికి అవకాశం లేదని తెలిపారు.ఇంకా మరే అక్రమ కార్యకలాపాలు చేసిన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.