
*ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం విడనాడాలి : కాసాల*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, 9 జులై (మన ప్రజావాణి)*:
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట శివాలయం వద్దన రోడ్డు వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో రోడ్డుకు ఇరువైపులా ప్రమాదాల నివారణకై ఎరుపు రంగు గుర్తులు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను పలుమార్లు కోరుతున్నప్పటికీ పట్టింపులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇకనైనా నిర్లక్ష్యం విడనాడాలని సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి కోరారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన రోడ్డు వంతెన నిర్మాణం వద్ద మీడియాతో మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా చిన్నపాటి బస్తా ముఠాలకు రెండించులు మించని ఎరుపు గుర్తులు ఏర్పాటు చేయడంతో అవి రాత్రి వేళలో వాహనదారులకు కనిపించని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు బాధ్యతగా గుర్తెరిగి తక్షణ పరిష్కారం చూపాలన్నారు.