
*మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జూలై 10 (మన ప్రజావాణి)*
నల్గొండ జిల్లా లోని ప్రభుత్వ బాలికల కళాశాల నందు ప్రిన్సిపల్ సుధారాణి అధ్యక్షతన నల్గొండ ఆధ్వర్యంలో లయన్ ఎర్రమాద శ్రీనివాస్, వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు ఎర్రమాద సత్తయ్య రాములమ్మ ల స్మారకార్థం కళాశాల టాపర్స్ ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఇసి, ఒక్కొక్కరికి 1500 రూపాయలు నగదు బహుమతులను అందించారు వ్యక్తిత్వ వికాస నిపుణులు పూర్ణ శశికాంత్ చే విద్యార్థుల యువ వికాస్ కార్యక్రమంలో లక్ష్యాలు నిర్ణయించుకోవడం ఎలా స్వల్ప కాలిక లక్ష్యాలు చేరుకోవడం ఎలా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి కావలసిన టెక్నిక్స్ ను చక్కని ఆక్టివిటీస్ ద్వారా విద్యార్థుల కి తెలియజేశారు. తల్లిదండ్రుల విలువలను గుర్తించి వారిని ఏ విధంగా చూసుకోవాలో వారి ఆశయాలను సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు మనం చేయాలో డ్రగ్స్ మత్తు పదార్థాలు దోపిడీకి వెళ్లకూడదంటూ అద్భుతమైన శైలిలో వివరించారు చివరకు అమ్మ నాన్న ల పై పాటకు స్పందించి ఏడుస్తూ తమ తల్లిదండ్రుల లక్ష్యసాధనకు వారి త్యాగానికి మా భవిష్యత్తును కానుకగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, అధ్యాపక సిబ్బంది, ఎల్ సి నల్గొండ అధ్యక్షులు పిచ్చయ్య, ఎల్సి స్నేహ బాధ్యులు సత్య శ్రీ, రవీందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.