
*వృధాగా పోతున్న త్రాగునీరు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జూలై 12 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ లోని హైదరాబాద్ రోడ్డు ప్రధాన రహదారి పై మిషన్ భగీరథ నీరు గత కొన్ని రోజులుగా పైపు లీకై త్రాగునీరు వృధాగా పోతుందని ప్రజలు అంటున్నారు. ఈ మిషన్ భగీరథ వాటర్ పై పత్రిక పేపర్లలో ప్రత్యేక కథనాలు వస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. అటుగా చూసుకుంటూ నాయకులు ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు గాని ఏ ఒక్కరైనా పట్టించుకోవడం లేదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలలో కొంతమంది రోడ్డు పనులు జరుగుతున్నాయిగా అని మరి కొంతమంది ఈ రోడ్డు పని పూర్తి కావాలంటే ఆరు నెలలు పడుతుంది అప్పటిదాకా మిషన్ భగీరథ వాటర్ ఇలా వృధాగా పోవడం కరెక్టేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.