
*ఈనెల14 జరిగే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి*
సూర్యాపేట జిల్లా కోదాడ, జూలై 11/మన ప్రజావాణి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు గీతా కార్మికులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి పెంచుతామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అయినా నేటికీ పింఛన్లు పెంచకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి గడ్డం ఖాసిం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుని హోదాలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచే వికలాంగుల పింఛను 6000కు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు గీతా కార్మికులు ఒంటరి మహిళల పింఛన్లను నాలుగువేలకు పెంచుతామని హామీ ఇచ్చిన నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయిన పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు నేటికీ పింఛన్లు పెంచకుండా కాలయాపన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరు దురదృష్టకరమని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అడుగడుగున వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తూ వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న తీరు తమ వికలాంగుల సమాజాన్ని ఎంతో ఆవేదనకు గురి చేస్తుందని ఎన్నికల సమయంలో అధికారులకు వస్తే వికలాంగుల పెన్షన్ 6000 పెంచడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తానని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరు నిరసిస్తూ ముఖ్యంగా చేయూత పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛలను అన్నింటిని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ నెల 14న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సుకు వృద్ధులు వితంతువులు వికలాంగులు బీడీ కార్మికులు గీతా కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు చీమల మండల నాయకులు రాము రాంబాబు శ్రీనివాస్ యాదయ్య సౌజన్య రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.