
*నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు*
•కోరుట్ల సీఐ సురేష్ బాబు
కోరుట్ల,జులై 11 (ప్రజావాణి)
నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోరుట్ల కార్గిల్ చౌరస్తా వద్ద నెంబర్ ప్లేట్ లేని 50 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు,మద్యం తాగి వాహనాలు నడప రాదని చట్టాన్ని అధికమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ తనిఖీలు కోరుట్ల ఎస్ఐ చిరంజీవి,కథలాపూర్ ఎస్ఐ నవీన్, మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి లు పాల్గొన్నారు