
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించడం విప్లవాత్మకమైన నిర్ణయం…*
*ప్రభుత్వ నిర్ణయం పద్మశాలి జాతికి శుభ సూచకం.*
*తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా జూలై / 11 / మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగిన కేబినెట్ సమావేశం లో బిసి లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చేసిన విధానాన్ని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ విప్లవాత్మకమైన , చారిత్రకమైన నిర్ణయంతో యావత్ తెలంగాణ పద్మశాలి సమాజానికి పిలుపు ఇస్తూ రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన పద్మశాలి చేనేత కార్మిక లోకం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి మన పద్మశాలి జాతి ఉన్నతిని తెలియ చేయాలని కోరారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘాల నాయకులు జాతిని చైతన్యం చేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి జాతిని జాగృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ప్రకటించారు. ఇది మనకు..మన కులానికి మంచి అవకాశం దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్డు మెంబర్లు మొదలుకొని సర్పంచులు , ఎంపీటీసీలు , జెడ్పీటీసీల
వరకు అవకాశం ఉన్న ప్రతి చోట
పోటీలో నిల్వాలని ఆయన పద్మశాలి జాతికి పిలుపునిచ్చారు. జాతిని చైతన్యం చేసే
విషయంలో వర్గ వైషమ్యాలు లేకుండా కృషి చేయాలని పద్మశాలి నాయకులను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు వెంట బాలరాజు నేత పాల్గొన్నారు.