
సింగరేణిలో నాసిరకపు నిర్మాణాలు కూలుతున్న పైకప్పులు
-సింగరేణి నివాస గృహల్లో పొంచి ఉన్న ప్రమాదం
-కార్మిక సంఘం సీఐటీయూ.
మంథని జూలై 15(మన ప్రజావాణి)
రామగుండం అర్జీ టు ఏరియాలోని పోతన కాలనీ 65 వ బ్లాకులో క్వార్టర్ నెంబర్ 908 నందు నివాసముంటున్న ఓవర్మెన్ రాకేష్ అనే కార్మికుడు నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్న సమయంలో మధ్యాహ్నము 1:40 నిమిషములకు ఆకస్మికంగా ఆ యొక్క క్వార్టర్ బెడ్ రూమ్ పై కప్పు కూలి మీద పడగా రాకేష్ నడుముకు గాయాలు కాగా చికిత్స కోసం డిస్పెన్సరీ తరలించారు.ఈ విషయం తెలుసుకున్న సిఐటియు ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యుడు కుంట ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని 65 బ్లాక్ ను పరిశీలించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి బ్లాక్ లో నివాసముంటున్న కార్మిక కుటుంబ సభ్యులు సింగరేణి యాజమాన్యం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని,కొన్ని నెలలుగా సమస్య చెప్పినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదని ఇట్టి సమయంలో చిన్నపిల్లలు ఉండి ఉంటే ప్రాణాలు పోయేవని తల్లి ఆవేదనను స్థానికులు ఓదార్చలేకపోయారని, కార్మికులు అండర్ గ్రౌండ్ లో పనిచేసి వచ్చి పడుకున్న సమయంలో అలా జరగడానికి తీవ్రంగా తప్పు పడుతూ, గతంలో నాసిరకప్పు నిర్మాణం చేయడం వలన ఇటువంటి ప్రమాదం జరిగిందని ఇప్పటికైనా జనరల్ మేనేజర్ వెంటనే స్పందించి రిపేర్ లో ఉన్న క్వార్టర్ లను అన్నింటిని వెంటనే రిపేర్ చేయించాలని, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జీ టు బ్రాంచ్ కమిటీ యజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.