
భర్తలను చంపుతున్న… భార్యలు…!
•••••మళ్ళీ మరో కేసు… తెలుగు రాష్ట్ర ల్లో ఆగని భర్తల హత్యలు..?
•••అన్ని అక్రమ సంబంధం వల్లే మరణాలు.
•••తోడు ఉండాల్సిన భర్త గొంతుపై తొక్కుతున్న భార్యలు..?
బ్యూరో//మన ప్రజావాణి
ఈమధ్య భర్తలను, భార్యలు చంపుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం నిత్యం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనలు మరువకముందే మళ్ళీ అలాంటిదే భర్తను కరెంట్ వైర్ తో చంపిన భార్య కేసు నెల్లూరు లో దాకలైంది. వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లా రావూరు కు చెందిన లేబాక శినయ్య, భార్య ధనమ్మ ఇద్దరు భార్య భర్తలు ధనమ్మ కు కళ్యాణ్ అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ వారిద్దరికీ శినయ్య అడ్డుపడడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ధనమ్మ,ప్రియుడు కళ్యాణ్ ఇద్దరు కలిసి కరెంటు వైర్తో శినయ్య గొంతు బిగించి చంపారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిత్యం ఇలాంటి ఘటనలు వివాహేతర సంబంధం వల్లే జరుగుతున్నాయని భర్తలు అడ్డువున్నారనే ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళల వల్లే ఈ సమాజానికి చెడ్డపేరు వస్తుందని తీవ్ర ఆరోపణలు వినపడుతున్నాయి.