
*పేకాట స్థావరం పై పోలీసులు మెరుపు దాడి*
👉7600 రూపాయల నగదు,2 ఫోన్లు స్వాధీనం
మన ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో శనివారం రోజు రాత్రి సమయంలో ఎల్లమ్మ టెంపుల్ వద్ద కొంతమంది వ్యక్తులు కలిసి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్సై రాహుల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పేకాటరాయుళ్ల పై మెరుపు దాడి చేయగా నలుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా అందులో నుండి ఇద్దరు వ్యక్తులు పారిపోగా మిగతా ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 02 మొబైల్ ఫోన్లు,ప్లేయింగ్ కార్డ్స్,నగదు 7600 రూపాయలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు..