
*న్యాయం చేయాలని తుర్కగూడెం – గ్రామ ప్రజలు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జూలై 26 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా మునుగోడు మండలం తుర్కగూడెం గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ దళిత కుటుంబాలకు చెందినవాళ్లము. గ్రామానికి చుట్టుపక్కల ఉన్న భూమిని మేము గత 40 సంవత్సరాల నుండి కబ్జా లో ఉన్నాము. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారు. ఆ తర్వాత గ్రామకంటానికి ఉన్న ఇండ్ల జాగా ప్రభుత్వం వారు మోడల్, స్కూల్, హాస్పిటల్, హాస్టల్, గ్రౌండ్, పార్కు కొరకు తీసుకొని అభివృద్ధి చేస్తామని ఎస్సై, తాసిల్దారు, ఆర్డిఓ, సెక్టార్ అభివృద్ధిని అడ్డుకోకండి అని మాకు చెప్పి ఈ స్థలాన్ని మునుగోడు మండల కు చెందిన రైతులకు పంట సేద్యానికి కబ్జా చేసి వారికి ఇస్తున్నారు. వారు మాపై దౌర్జన్యం చేసి నాతో గొడవకు దిగి మమ్మల్ని గడ్డివాములు, కట్టెలు తీయండి అని బెదిరిస్తూ మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ మేము విత్తనాలు వేసుకోవాలని పంట పొలాలను సేద్యం చేసుకోవాలని మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని తుర్కగూడెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇండ్ల కు సంబంధించిన భూమిని పంట సేద్యానికి కాకుండా ప్రభుత్వం సంబంధించిన మోడల్ స్కూల్, హాస్పిటల్, హాస్టల్, గ్రౌండ్, పార్క్, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చుట కొరకు వినియోగించుకోవాలి కానీ పంట సేద్యానికి మాత్రం ఇవ్వకూడదని తుర్కగూడెం గ్రామ ప్రజలకు అధికారులు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఆర్డీవో, ఎంఆర్ఓ, మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జి రమేష్, కె అంజయ్య, ఎ సైదులు, ఎం శ్రీశైలం, ఎం ముత్తయ్య, బి మల్లేష్, బి పారిజాత, లింగస్వామి, బి యాదగిరి, కే అంజయ్య, డి పద్మ, డి అశ్విని, ఎం స్వరూప, పార్వతమ్మ, ముత్తమ్మ, డి దుర్గయ్య, డి శ్రీను, డి శ్రీకాంత్, ఇ కృష్ణయ్య, కే గాలయ్య, కే శంకరయ్య, ఎం శంకరమ్మ, ఎం శ్రీశైలం, పరమేష్, రాములమ్మ, సరోజ, కే పద్మ, ఏ అలివేలు, అండాలు, బి హనుమంతు, ఎం మహేష్, డి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొనడం జరిగింది.