
అనుక్షణం బయం బయంగా సింగరేణి కార్మికుల జీవితాలు
-చోద్యం చూస్తున్న సింగరేణి యాజమాన్యం.
-కార్మిక సంఘం సిఐటియు.
మంథని మన ప్రజావాణి జూలై 27
రామగుండం అర్జీ టు ఏరియాలోని ఎనిమిదవ కాలనీ మరియు పోతన కాలనీ లో సింగరేణి నివాస ప్రాంతాలలోని గృహాలను సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బస్తీబాట ఉదయం తొమ్మిది గంటలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజరెడ్డి ఆధ్వర్యంలో కార్మికుల గృహాలను సందర్శించడం జరిగింది. అందులో ఎనిమిదవ కాలనీలోని సి టూ పదవ బ్లాకులో నివాసముంటున్న సుధీర్ క్వార్టర్ పరిస్థితి చూస్తే రూఫ్ బిచ్చులు ఉడి తన చిన్న కుమారుడి పై పడి గాయపడటం జరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అనుక్షణం ప్రాణాలను బయం గుప్పిట్లో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఉందని,
టి వన్ 398 నివసించే కార్మికుడి ఆవేదన వింటే గుండె తరుక్కుపోయిందని,గత ఎనిమిది సంవత్సరాలుగా అదే క్వార్టర్స్ నివాసం ఉంటున్న భార్య,భర్తలు ఇద్దరు ఆఫీసు ల చుట్టూ తిరిగి అలిసి పోయారని,వర్షాలకు రేకులు పగిలి ఇంట్లోకి వర్షపు నీరు రావడం వల్ల కార్మికుడి తల్లి కాలుజారి క్రిందపడి కాలు విరిగిందని,తన బాధను సి అండ్ ఎండికి తెలియజేసిన కుడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.టి టూ 628, టి టూ-625 ఇంకా ఎన్నో క్వార్టర్స్ కి డ్రైనేజ్ మరియు వర్షాలకు గోడలు తేమగా మారుతున్నాయి వెంటనే డాంబర్ షీట్ లను వేయాలని,మహా కవి పోతన కాలనీ విషయానికి వస్తే ప్రతి బ్లాక్ లోని అనేక ఇబ్బందులు పడుతున్నారు.మొన్న బ్లాక్ 65 లో రూఫ్ పడి సింగరేణి ఓవర్మెన్ కు గాయం కాగా, బ్లాక్ 7 -98,91,96 మరియు
బ్లాక్ 5 లో 65 రూఫ్ పడడానికి సిద్ధంగా ఉందని,బ్లాక్ 15 లో 208 వెంటనే మరమత్తులు చేపట్టాలని లేకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు.క్వార్టర్ లలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నా పలు సమస్యలు
వాటిలో ప్రధానమైనవి తుమ్మల రాజారెడ్డి తెలిపారు.
మహాకవి పోతన కాలనీలో ఏదైనా క్వార్టర్ లకు సంబంధించిన సమస్య మీద రిపోర్ట్ ఇస్తే రాసుకోడమే తప్ప రోజులు నెలల తరబడి రిపెర్ చేయకుండా,మ్యాన్ పవర్ లేదని,మెటీరియల్ లేదని కాలం వెల్లదీస్తున్నారని, డ్రైనేజీ,తలుపులు,కిటికీల చిన్న చిన్న రిపేర్లకు సైతం రోజుల తరబడి సివిల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని, సివిల్ సూపర్ వైజర్ హరీష్ ని వెంటనే తొలగించాలని,ఏదైనా సమస్యపై యాజమాన్యం స్పందించి ఆదేశాలిచ్చినప్పటికి పట్టించుకోకుండా చిన్న పనులకు కూడ కాలయాపన చేస్తు నిర్లక్ష్యంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అవసరాలకు సరిపడా నీళ్ళు రావడం లేదని,మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేదని,రూప్ లు కారడం,పెచ్చులు పడుతున్నాయని,డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, విచ్చలవిడిగా పందులు, కుక్కలు,కోతుల బెడద ఉన్నదని,పలుమార్లు కరెంటు పోతుందని,సాయంత్రం కరెంటు పోతే సబ్ స్టేషన్ లో ఎవరు ఉండరని,రాత్రి డ్యూటీలో ఒవేళ కరెంటు పోతే ఆడవాళ్ళం భయంగా భయంగా గడుపుతున్నామని,
గత పది రోజులు నుండి ఆర్వో ప్లాంట్ లో మోటర్ కాలిపోయి ఉండడం వల్ల మంచినీళ్లు రావడం లేదని,కలుషిత నీటితో కార్మిక కుటుంబ సభ్యుల అనారోగ్యాల బారిన పడుతున్నారని,కార్మికుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని లేనిచో కార్మికుల పక్షాన ఉద్యమాన్ని ఉదృతం చేసి కార్మిక కుటుంబ సభ్యులతో జిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్జి టూ ఏరియా సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్,అధ్యక్షుడు వినయ్, సోమారపు వెంకన్న,ఆర్గనైజర్ సెక్రటరీ సంపత్ కుమార్, నరసింహ,రాంప్రసాద్,వినేశ్,సంపత్,తిరుపతి,ప్రేమ్ కుమార్,వినయ్ రాజ్ కుమార్ ,రమేష్ ,రాకేష్ అర్జీ త్రీ అధ్యక్షకార్యదర్శి విజయ్ కుమార్,కొమురయ్య,రాజేష్ కార్యకర్తలు,కాలనీ ఉద్యోగులు పాల్గోన్నారు.