మెరిట్ ఉన్నా హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ జడ్జీలేరి?:ఈటల

Ramesh

Ramesh

District Chief Reporter

న్యాయమూర్తుల నియామకంలో కుల వివక్ష, కుటుంబ నియామకాల వ్యవస్థ మిగతా అన్ని రంగాల్లో కంటే ఎక్కువగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. అన్ని విధాలుగా సామర్థ్యం, అర్హతలు ఉన్నా ఇప్పటికీ బీసీలు హైకోర్టు, సుప్రీంకోర్టులలో జడ్జీలుగా ఎందుకు లేరని ఇదేం దుర్మార్గం అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ (Somajoguda Press Club) లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలకు శాసన సభ, శాసన మండలి, పార్లమెంటులో రిజర్వేషన్లు లేవని అలాగే న్యాయవ్యవస్థలో కూడా వివక్ష కొనసాగుతుందన్నారు. ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ ఉందని కులాల మీద లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందన్నారు.

 

అంబేద్కర్ (Ambedkar) స్ఫూర్తి దేశంలో అమలు కావడంలేదని రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్న పాలకులు లేరని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మెరిట్ లెస్ రూలర్స్ దేశాన్ని పాలించారని విమర్శించారు. నేను కులానికి, మతానికి వ్యతిరేకం కాదని కేవలం వివక్ష, దుర్మార్గం, పేదరికానికి తాను వ్యతిరేకం అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోరడం, ఇంత మెరిట్ ఉన్నా మా వాటా ఎందుకు లేదు అని మనమంతా గళమెత్తే దుర్మార్గ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. ఓబీసీకి చెందిన మోడీ (Narendra Modi) ప్రధాన మంత్రి అయినప్పుడు కొంతమంది ఏవేవో మాట్లాడారు. కానీ సంకీర్ణ యుగంలో మూడవ సారి అధికారంలోకి వచ్చారు అంటే ఇది మోడీ మెరిట్ కాకుంటే ఏమనాలన్నారు. ఆకలి దుఃఖం నుండి వచ్చినవాడు ఉంటే ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రధాని అయ్యారన్నారు. ఆకలి అనుభవించిన ఐఏఎస్ అధికారి దగ్గరికి వెళితే.. ప్రజల కోసం పరిష్కారం చూపుతారు. అదే బాధ తెలియని అధికారి కేవలం రూల్స్ మాత్రమే చెప్పి పంపిస్తారన్నారు.

 

బీసీ-బీ, బీసీ-డి లో ఓపెన్ కాంపిటేషన్ కంటే ఎక్కువ కాంపిటేషన్ ఉందని హక్కుల కోసం కొట్లడాలి, సాధించుకున్న హక్కుల అమలుకోసం కూడా కోట్లడాలి అంటే ఎంత దుర్మార్గం. మర్లపడ్డ తెలంగాణలాగా బీసీ వర్గాలు దేశవ్యాప్తంగా మర్లపడే రోజు వస్తుంది. తెలంగాణ ఒక వేగుచుక్క అవుతుందన్నారు. అడ్వకెట్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరు మర్చిపోలేనిదని మీ స్ఫూర్తి, ఐక్యత గొప్పదన్నారు. అడ్వకెట్లుకు ఉపాధి లేకుండా పోతుందని కుటుంబాలను పోషించే పరిస్థితి లేకుండా పోయింది. వీరికి ఐదేళ్లవరకు స్టైఫెండ్, వైద్య బీమా అందించాలని డిమాండ్ చేశారు. మీ ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నాన్నానన్నారు.

 

ఈ సమావేశంలో న్యాయస్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 256 మంది న్యాయమూర్తులు నియమితమైతే బీసీ 4, ఎస్సీ 5, ఎస్టీ 1, మహిళలు 11 మంది మాత్రమే జడ్జీలు అయ్యారు. 97 శాతం మంది అగ్రవర్ణాలు, 2.9 శాతం మంది బీసీ ఎస్సీలు నియామకమయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు హైకోర్టు జడ్జీలుగా 211 మంది నియామకాలు జరిగితే, ఇందులో 155 మందిని బార్ నుండి ఎంపిక చేశారు. అందులో అగ్రవర్ణాల నుండి 155 , ఎస్సీ 5, ఎస్టీ 1, బీసీ 16, మైనారిటీలు 9 మంది నియమించబడ్డారు. ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు రిజక్వేషన్లు కల్పించేలా అందుకు అనుగుణంగా చట్టాలను రూపొందించాలి అని ఈ సమావేశం తీర్మానించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

*మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితుల ను అరెస్టు చేసిన జిల్లా పోలీస్* *మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవు.* *… జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 22 (మన ప్రజావాణి)*: గత కొంత కాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ పని సమయ వేళలు పాటించకుండా ఆధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెర నుండి , దేవరకొండ సబ్ డివిజన్ పరిధి లో 32 కార్మికులు, 4 గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయం తో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. *నిందితుల వివరాలు* . వడ్త్య జవాహర్ లాల్ తండ్రి రాములు, వయస్సు: 50 సం.లు, నివాసం : బనాలకుంట గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. రామవత్ రమేష్ తండ్రి లక్పతి , వయస్సు: 24 సం.లు,నివాసం : పాయ తండా గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. మైలపల్లి శివ తండ్రి దేవుడు, వయస్సు: 30 సం.లు, నివాసం : ఇంటి నెంబర్. 4-45 వాడపాలెం గ్రామం, రాంబిల్లి మండల్, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. కారే సింహా చలం తండ్రి: సింహా చలం, వయస్సు: 39 సం.లు, నివాసం : బంగారమ్మపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. వంక విశాఖ @ ఇషాక్ తండ్రి: మహంకాల్, వయస్సు: 26 సం.లు, నివాసం : అమలాపురం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. ఎరిపల్లి బాబుజీ @ బావొజి తండ్రి: బంగారి, వయస్సు: 45 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. చాపల తాత రావు తండ్రి: సోమరాజు, వయస్సు: 38 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ. చాపల బంగారి తండ్రి: బంగారి వయస్సు: 39 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. *నమోదైన కేసుల వివరాలు* : క్రైమ్. నెంబర్.66/2025 యు/ఎస్ 143(4), 146 బి ఎన్ ఎస్ సెక్షన్. 79 ఆఫ్ జె జె యాక్ట్ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ , క్రైమ్ నెంబర్. 68/2025 యు/ఎస్ 146 బి ఎన్ ఎస్ సెక్షన్.18 ఆఫ్ బిఎల్ఎస్ఎ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్. 69/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ పి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్.117/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.18 బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ గుడిపల్లి, క్రైమ్. నెంబర్.118/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 ఆఫ్ జె జె యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పి ఎస్ గుడిపల్లి *కేసు వివరాలు* పైన తెలిపిన నిందితుల లో గుడిపల్లి కి చెందిన జబ్బార్ @ జవహర్ లాల్, రమేశ్, శివ లు వీరి ఏజెంట్లు అయిన రాజు,(హైద్రాబాద్) జగన్, (హైద్రాబాద్) లోకేశ్ (విజయవాడ)లకు ఒక వ్యక్తి కి 1500 చొప్పున కమిషన్ ఇచ్చి హైద్రాబాద్ విజయవాడ నుంచి వలస కార్మికులను నెలకు 15 వేల జీతం, రోజుకి 2 గంటల పని, ఉచిత ఆహారం మరియు మద్యం సరఫరా చేస్తాం అని మబ్య పెట్టి వారిని అక్కడ నుంచి దేవరకొండ లోని మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడ నుంచి నిందితులు వారి సెల్ ఫోన్ తమ అదినంలో పెట్టుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల పైన నేరేడు గుమ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాలకుంట,వైజాగ్ కాలనీ కి తరలించి వారితో అక్కడ తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారు. అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారు. వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే ఆహారం అందిచేవారు. వీరికి పని బారం ఎక్కువ అయితుంది. మేము చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారు. ఇదే విదంగా నిందితులు అయిన ఇషాక్ మరియు సింహాచలం వారి ఏజెంట్ అయిన వెంకన్న (విజయవాడ) (5000 ఒక్కరికీ కమిషన్) కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. పైన తెలిపిన ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేశ్, వెంకన్నలు కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఈ ఆపరేషన్ ను దేవరకొండ ఎ ఎస్పి మౌనిక పర్యవేక్షణలో డిండి, కొండమల్లేపల్లి సిఐ లు, గుడిపల్లి, నేరేడు గుమ్ము , గుర్రంపోడ్ ఎస్సై రెవెన్యూ, చైల్డ్ కేర్, చైల్డ్ లైన్ , సి డబ్ల్యూ సి బృందం, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.‌పి.‌ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

 నోటిఫికేషన్స్

 Share