
ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్..!
లైసెన్స్ జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు 1500 లంచం డిమాండ్
ఖమ్మం బ్యూరో, ప్రజావాణి
మార్చి 11:
ఖమ్మం జిల్లా కేంద్రంలో లైసెన్స్ జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు 1500 రూపాయలు లంచంగా సీనియర్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పి వై రమేష్ మంగళవారం చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న భూక్యా సోమ్లా అనే ఉద్యోగి ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ మెరుపు దాడితో ఖమ్మం నగరంలో కలకలం రేపింది.